చైతుకే దక్కిన లక్కీ ఛాన్స్

By iDream Post Jul. 09, 2021, 07:28 pm IST
చైతుకే దక్కిన లక్కీ ఛాన్స్

అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ డెబ్యూ ముహూర్తం బాగా కుదిరింది. లాల్ సింగ్ చద్దాలో ఏకంగా అమీర్ ఖాన్ తోనే స్క్రీన్ షేర్ చేసుకునే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. ఇటీవలే ప్రారంభమైన షెడ్యూల్ లో కీలకమైన యుద్ధ సన్నివేశాలలో ఇద్దరూ కలిసి పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రశంసలు అందుకున్న హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ ఆధారంగా రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ లో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సగ భాగం షూటింగ్ పూర్తి కాగా డిసెంబర్ రిలీజ్ ను టార్గెట్ చేసుకుని ఇప్పుడు వేగంగా కానిస్తున్నారు. కానీ ఖచ్చితంగా వస్తుందా లేదా అనేది మాత్రం చెప్పలేం.

కమర్షియల్ కథల జోలికి వెళ్లకుండా గత కొన్నేళ్లుగా తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేస్తున్న అమీర్ ఖాన్ తో కలిసి నటించడం అంటే చైతుకి ఎన్నో రకాలుగా ఉపయోగపడేదే. 1988లో ఇతని మొదటి సినిమా ఖయామత్ సే ఖయామత్ తక్ విడుదలయ్యింది. ఇది బ్లాక్ బస్టర్. మరుసటి ఏడాది నాగార్జున శివ రిలీజై కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. అప్పటికి నాగ్ నటనానుభవం కేవలం నాలుగేళ్లే. అంటే నాగ్ అమీర్ లు ఇంచుమించు ఒకే అనుభవం ఒకే తరం కిందకు వస్తారు. అంతటి అమీర్ తో జ్ఞాపకాలు మిగుల్చుకోవడం అంటే చైతన్యకు ఎప్పటికీ స్పెషల్ గానే ఉండిపోతుంది. నిజానికి ఈ క్యారెక్టర్ విజయ్ సేతుపతి చేయాల్సింది.

కానీ కాల్ షీట్స్ కారణంగా వదులుకున్నాడు. లాల్ సింగ్ చద్దాకు దర్శకుడు అద్వైత్ చందన్. ఇతను డైరెక్ట్ చేసిన సినిమా ఇప్పటిదాకా ఒక్కటే. అది కూడా అమీర్ తో తీసిన సీక్రెట్ సూపర్ స్టార్. అందులో టేకింగ్ నచ్చే ఈ ఆఫర్ వచ్చింది. ఫారెస్ట్ గంప్ పాత సినిమా కాబట్టి ఇప్పటి జెనరేషన్ కు అనుగుణంగా చాలా మార్పులు చేశారు. మరి చైతు పాత్ర నిడివి ఎంత ఉంటుందనే క్లారిటీ లేదు కానీ నలభై నిమిషాలలోపే అని ఇన్ సైడ్ టాక్. థియేటర్ల పరంగా తీవ్ర అనిశ్చితి ఎదురుకుంటున్న బాలీవుడ్ లో ఎప్పుడు పెద్ద సినిమాలు విడుదల అవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. లాల్ సింగ్ చద్దా ఇప్పటికైతే అనుకున్న డేట్ డిసెంబర్ 21.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp