ఆది పురుష్ మ్యూజిక్ ఎవరంటే

By iDream Post Jun. 09, 2021, 03:30 pm IST
ఆది పురుష్ మ్యూజిక్ ఎవరంటే
డార్లింగ్ ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీగా తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఆది పురుష్ తాలూకు షూటింగ్ కరోనా వల్ల ప్రస్తుతానికి ఆగిపోయినా ఇతర పనులు మాత్రం జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన వర్క్స్ తో పాటు టీమ్ సెట్టింగ్ లో బిజీగా ఉన్నారు దర్శకుడు ఓం రౌత్. ఇప్పటిదాకా సంగీత దర్శకుడు ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగగా దీనికి తాజాగా చెక్ పెట్టినట్టు లేటెస్ట్ అప్ డేట్. సచెత్-పరంపర టాండన్ లను ఎంపిక చేసినట్టు ముంబై టాక్. ఇలాంటివి సింపుల్ గా చెప్పేయరు కాబట్టి అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకు కొంత టైం పడుతుంది. ఇదంతా లీకుల రూపంలో వచ్చిన సమాచారమే.

వీళ్లిద్దరిని సెట్ చేసుకోవడానికి కారణం లేకపోలేదు. ఈ సచేత్ టాండన్ లే ఓం రౌత్ గత చిత్రం తానాజీకి మ్యూజిక్ ఇచ్చారు. దానికి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎక్కువ ప్రశంసలు దక్కాయి. అందుకే వేరే ఆలోచన చేయకుండా వీళ్ళను లాక్ చేసినట్టు తెలిసింది. ఇది కాకుండా ఈ ద్వయం అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్, హిందీ జెర్సీ, స్ట్రీట్ డాన్సర్ తదితర సినిమాలకు పని చేశారు. మంచి సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు ఉంది. అయితే వీళ్ళ ట్యూన్స్ ఎక్కువగా నార్త్ ఆడియన్స్ టేస్ట్ ని ఆధారంగా చేసుకుని ఉంటాయి. మనవాళ్లకు కనెక్ట్ అయ్యేలా ఎలా కంపోజ్ చేస్తారో.

కరోనా సెకండ్ వేవ్ తెచ్చిన లాక్ డౌన్ వల్ల మొన్నటిదాకా పక్కా ప్లానింగ్ తో ఉన్న అది పురుష్ టీమ్ ఇప్పుడు మొత్తం రీ షెడ్యూల్ చేసే పనిలో ఉన్నది. అధిక భాగం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకోనున్న ఆది పురుష్ కోసం సీతగా నటిస్తున్న కృతి సనన్ ఇప్పటికే మేకోవర్ మొదలుపెట్టింది. ఏకధాటిగా రెండు నెలలు చేస్తే మొత్తం పూర్తవుతుందని ఇన్ సైడ్ టాక్. అయితే విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కోసమే సుమారు ఏడెనిమిది నెలలు అవసరమవుతాయని అందుకే రిలీజ్ కూడా సలార్ తర్వాత ప్లాన్ చేసుకున్నారు. తెలుగుతెర మీద చాలా గ్యాప్ తర్వాత సుమన్ చేశాక మళ్ళీ ప్రభాస్ ని రాముడిగా కనిపించబోతున్నాడు. అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp