సెప్టెంబర్ 17 - మరో యుద్ధానికి సిద్ధం

By iDream Post Sep. 15, 2021, 08:30 pm IST
సెప్టెంబర్ 17 - మరో యుద్ధానికి సిద్ధం

టాలీవుడ్ కు మరో శుక్రవారం వచ్చేస్తోంది. క్రమం తప్పకుండా సినిమాలు విడుదల చేయడంలో దేశం మొత్తం మీద ఒక్క టాలీవుడ్ మాత్రమే ముందంజలో ఉందన్నది వాస్తవం. బెల్ బాటమ్, చెహరేల స్పందన చూశాక హిందీ చిత్రాల రిలీజ్ డేట్లు ఆగిపోయాయి. మహారాష్ట్రలో ఇంకా థియేటర్లు తెరుచుకోకపోవడంతో నార్త్ మొత్తం ఇంగ్లీష్ తో పాటు తమిళ తెలుగు మీదే ఆధారపడుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 17న మూవీ లవర్స్ కోసం మళ్ళీ సందడి నెలకొనబోతోంది. కనీసం అయిదారు ఉంటే తప్ప బాక్సాఫీస్ ఒప్పుకోదన్న తరహాలో నిర్మాతలు ఎంత పోటీ ఉన్నా సరే వెనక్కు తగ్గడం లేదు. ఈ ఫ్రైడే కూడా మరోసారి దానికి వేదిక కాబోతోంది.

అన్నిటికంటే కాస్త ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా గల్లీ రౌడీ. హాస్య చిత్రాలకు పేరున్న జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో కోన వెంకట్ రచనలో రూపొందిన ఈ కామెడీ థ్రిల్లర్ ట్రైలర్ ఇటీవలే రిలీజై అంతో ఇంతో ఆసక్తి రేపింది. బాబీ సింహా లాంటి పవర్ ఫుల్ క్యాస్టింగ్ ని గట్టిగానే సెట్ చేసుకున్నారు. సందీప్ కిషన్ దీని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటించిన డబ్బింగ్ మూవీ విజయ రాఘవన్ కూడా బరిలో దిగుతోంది. దీని మీద అంచనాలు సున్నా కానీ టాక్ తో ఏదైనా అద్భుతం జరక్కపోదా అని టీమ్ నమ్మకంతో ఉంది. ఇప్పటిదాకా పెద్దగా ప్రమోషన్లు చేసింది లేదు

ఇవి కాకుండా హర్భజన్ సింగ్ నటించిన ఫ్రెండ్ షిప్, జెమ్, ప్లాన్ బి, హానీ ట్రాప్ అని మరో నాలుగు చిన్న సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. వీటికి ఓపెనింగ్స్ ని ఊహించుకోవడం కష్టమే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకోబోతున్న నితిన్ మాస్ట్రో మరోవైపు కవ్విస్తోంది. అన్నిటికంటే భారీగా అవుట్ డోర్ పబ్లిసిటీ మాస్ట్రోకు చేశారు. సో మూవీ లవర్స్ కు ఎల్లుండి ఉన్న ఆప్షన్స్ మొత్తం ఏడు. ఇవి కాకుండా డోంట్ బ్రీత్ 2 లాంటి హాలీవుడ్ సినిమాలు మల్టీ ప్లెక్సుల్లో పోటీ ఇవ్వబోతున్నాయి. చూడాలి మరి ఈసారైనా భారీ బ్లాక్ బస్టర్ అనిపించుకునే సీన్ దేనికైనా ఉందో లేదో

Also Read : సాయి తేజ్ క్షేమం - రక్షకుడికి ఇబ్బంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp