Rajini's Peddhanna : దీపావళి పండగకు సినిమా టపాసులు

By iDream Post Oct. 17, 2021, 12:15 pm IST
Rajini's Peddhanna : దీపావళి పండగకు సినిమా టపాసులు

ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ప్రేక్షకులు పెద్దా చిన్న తేడాలు అంతగా చూసుకోవడం లేదు. విషయం ఉందా చాలు హిట్టు కొట్టించి మరీ నిర్మాతలకు లాభాలు అందిస్తున్నారు. అందుకే ప్రతి శుక్రవారం పోటీపడుతూ ప్రకటనలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అందరి కన్ను దీపావళి మీదకు వెళ్తోంది. ఎన్నడూ లేనిది ఈసారి దసరా పండక్కు బాక్సాఫీస్ బాగా కళకళలాడింది. అందుకే టపాసుల సంబరాల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందనే నమ్మకంతో ఇండస్ట్రీ జనాలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి వారం పోటీ ఆసక్తికరంగా మారుతోంది. ఎవరు విజేతగా నిలుస్తారనే అంచనాలు ఖచ్చితంగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరి నవంబర్ 4 ఎలా ఉండబోతోందో.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో రూపొందిన అన్నాతేకు తెలుగు టైటిల్ ని పెద్దన్నగా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తమిళ టీజర్ వచ్చింది కానీ ఇంకా డబ్బింగ్ వెర్షన్ ది సిద్ధం కాలేదు. రజని మార్కు పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన పెద్దన్నలో నయనతార హీరోయిన్ కాగా కీర్తి సురేష్ చెల్లెలిగా నటించింది. మీనా, ఖుష్బూ, ప్రకాష రాజ్ లాంటి భారీ క్యాస్టింగ్ సెట్ చేసుకున్నారు. ఎస్ పి బాలసుబ్రమణ్యం పాడిన చివరి పాట ఇందులో ఉంది. ఈ రకంగా ఇప్పటికే దీని మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కాకపోతే గత డిజాస్టర్ల దృష్ట్యా బిజినెస్ విషయంలో రాజీ పడక తప్పలేదు.

ఇక దీంతో పోటీ పడుతున్న చిన్న సినిమా మంచి రోజులు వచ్చాయి. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ ఇప్పటికే ట్రైలర్ రూపంలో హైప్ తెచ్చేసుకుంది. ప్రతి రోజు పండగే తరహాలో దీన్ని కూడా కామెడీ బేస్ చేసుకుని తీసిన మారుతీ తక్కువ బడ్జెట్ ఎక్కువ రిటర్న్స్ సూత్రంతో కేవలం నలభై రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం విశేషం. మరి పెద్దన్నను ఢీ కొట్టగలదా అంటే ఏమో చెప్పలేం. ఏదైనా జరగొచ్చు. వీటితో పాటు ఒక రోజు ఆలస్యంగా సూర్యవంశీ, విశాల్ ఎనిమిలు కూడా రాబోతున్నాయి. మరి రసవత్తరమైన ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

Also Read : Small Releases : వచ్చే వారం బడ్జెట్ చిత్రాల భారీ యుద్ధం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp