భిన్న ధృవాల లవ్ స్టోరీలో అఖిల్ పూజా

By iDream Post Sep. 30, 2021, 06:45 pm IST
భిన్న ధృవాల లవ్ స్టోరీలో అఖిల్ పూజా

ఈఎంఐ వాయిదాల తరహాలో బోలెడుసార్లు పోస్ట్ పోన్లు చేసుకుంటూ వచ్చిన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎట్టకేలకు ఈ నెల 15న విడుదల కాబోతోంది. అక్కినేని అభిమానులు గత రెండేళ్లుగా దీని కోసం చేసిన ఎదురుచూపులకు ఫలితం దక్కబోతోంది. బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వం వహించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ ని గీత ఆర్ట్స్ 2 సంస్థ పై బన్నీ వాస్ నిర్మించారు. గోపి సుందర్ మ్యూజిక్ యూత్ లోకి బాగానే వెళ్లిపోయింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన దీని మీద అఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి అర్ధ దశాబ్దం దాటినా పలకరించని హిట్టు దీంతో వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఇందాక ట్రైలర్ రిలీజ్ చేశారు.

కాబోయే వాడు ఎలా ఉండాలి, అతనితో ఏమేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి లాంటి ఎన్నో కోరికలతో పెళ్లి మీద ఒక క్లారిటీతో ఉంటుంది అమ్మాయి(పూజా హెగ్డే). అతని(అఖిల్)కి లైఫ్ లో కొన్ని గోల్స్ ఉన్నాయి. కెరీర్ సగం మ్యారేజ్ సగం లైఫ్ అనే రీతిలో పక్కా ప్లానింగ్ తో ఉంటాడు. అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే బిరుదు ఉంటుంది. కానీ పెళ్లి చూపులకు వెళ్లి అమ్మాయిలను విచిత్రమైన ప్రశ్నలు వేస్తుంటాడు. అందుకే సంబంధాలు మిస్ అవుతూ ఉంటాయి. ఓ సందర్భంలో పై ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. రెండు భిన్న ధృవాల వీళ్ళ ప్రయాణం ఎక్కడికి చేరుకుంది అనేదే కథలా కనిపిస్తోంది

అఖిల్ లుక్స్ పరంగా ఎప్పటిలాగే బాగున్నాడు. గతంలో చూసిన లవర్ బాయ్ షేడ్స్ ఉన్నట్టు అనిపించినా క్యారెక్టర్ పరంగా కొంత వైవిధ్యాన్ని జోడించినట్టు కనిపిస్తోంది. పూజా హెగ్డే స్వంత డబ్బింగ్ తో మరోసారి గట్టి లెన్త్ ఉన్న క్యారెక్టర్ దక్కించుకుంది. ఆమని, పోసాని లాంటి ఇతర తారాగణం ఉన్నా మొత్తం ఫోకస్ లీడ్ పెయిర్ మీదే ఉంది. చిన్న క్యామియోలో ఈషా రెబ్బ, ఫరియా అబ్దుల్లా లాంటి ముద్దుగుమ్మలను పెట్టారు. గోపి సుందర్ సంగీతం, ప్రదీశ్ ఎం వర్మ ఛాయాగ్రహణం సమకూర్చిన ఈ లవ్ ఎంటర్ టైనర్ లో కొంత ఆరంజ్ ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 15న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ థియేటర్లలో రాబోతున్నాడు

Also Read : సంక్రాంతికి రావడానికి 'ఆర్ఆర్ఆర్' విశ్వప్రయత్నాలు.. అసలు సంగతి ఇదా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp