రానా నాయుడు - ఇది క్రేజీ కలయిక

By iDream Post Sep. 22, 2021, 01:00 pm IST
రానా నాయుడు - ఇది క్రేజీ కలయిక

దగ్గబాటి అభిమానుల ఎదురు చూపులు ఫలిస్తున్నాయి. వెంకటేష్ రానాలను ఒకే సినిమాలో చూడాలన్న చిరకాల కాంక్ష కృష్ణం వందే జగద్గురుమ్ లో కేవలం ఒక పాటలో మాత్రమే తీరింది. కానీ అది సరిపోయేది కాదు, పరిగణనలోకి తీసుకునేది కాదు. ఈ కాంబోలో ఒక పవర్ ఫుల్ కంటెంట్ ని చూడాలన్న వాళ్ళ కోరిక 'రానా నాయుడు'తో తీరబోతోంది. కాకపోతే వెబ్ సిరీస్ కోసం ఈ కలయిక సాధ్యమయ్యింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న రానా నాయుడు ఫస్ట్ లుక్ ఇందాక విడుదల చేశారు. కాకపోతే దర్శకుడు ఎవరు ఎప్పుడు ప్రీమియర్ చేయబోతున్నారు లాంటి డీటెయిల్స్ చెప్పలేదు లేదు కానీ ఆ వివరాలు మీ కోసం

దీనికి ఇద్దరు దర్శకులు. ఒకరు కరణ్ అంశుమాన్. మరొకరు సుపర్న్ ఎస్ వర్మ. ప్రసిద్ధ అమెరికన్ డ్రామా 'రే డోనోవాన్' ఆధారంగా ఇది రూపొందిస్తున్నట్టు ముంబై టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ ఇది దాదాపు వాస్తవమే. ఇక డైరెక్టర్ల ట్రాక్ రికార్డు చూస్తే కరణ్ 2015లో 'బ్యాంగిస్తాన్' తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయం సాధించారు. ప్రైమ్ కోసం రూపొందించిన వెబ్ సిరీస్ లు ఇన్ సైడ్ ఎడ్జ్, మీర్జాపూర్ రెండూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక సుపర్న్ విషయానికి వస్తే 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ కు రచయిత ఇతనే. రోహిత్ శెట్టి, హన్సల్ మెహతా లాంటి అగ్ర దర్శకులతో పని చేసిన అనుభవం ఉంది. విషయమున్న రైటరే

సో మొత్తానికి క్రేజీ కాంబినేషన్ తో రానా వెంకీలు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మొత్తం తెల్ల జుట్టుతో వెంకటేష్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండగా రానా కూడా యూత్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉన్నాడు. సౌత్ మీద ఇటీవలి కాలం ఫోకస్ పెంచుతున్న నెట్ ఫ్లిక్స్ దానికి అనుగుణంగానే బడ్జెట్ విషయంలో రాజా పడకుండా ఇలాంటి కాంబినేషన్లను సెట్ చేస్తోంది. సంగీత దర్శకుడు ఇతర టెక్నికల్ టీమ్ కూడా బాలీవుడ్ బ్యాచే ఉండబోతోంది. హిందీతో పాటు ప్రధాన భాషలు అన్నిటిలోనూ డబ్బింగ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి షూటింగ్ ఇంకా జరుగుతోంది కాబట్టి విడుదలకు సంబంధించి క్లారిటీ లేదు కనక వేచి చూడాలి

Also Read : నిజమైన రిపబ్లిక్ నిర్వచనమిస్తున్న కలెక్టర్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp