మంచి ఫలితానిచ్చిన 'మాస్టర్' గేమ్

By iDream Post Jan. 12, 2021, 01:11 pm IST
మంచి ఫలితానిచ్చిన 'మాస్టర్' గేమ్

రేపు విడుదల కాబోతున్న మాస్టర్ కి తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదల దక్కుతోంది. విజయ్ కెరీర్లో ఇంత రేంజ్ లో ఇక్కడ రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. చాలా చోట్ల బిసి సెంటర్లలో కూడా తెల్లవారుఝామునే బెనిఫిట్ షోలు వేస్తున్నారు. రజనికాంత్ లాగా విజయ్ కు ఇక్కడేమి పెద్ద అభిమాన సంఘాలు లేవు. బాగుందని టాక్ వస్తే మెల్లగా పికప్ అయిపోయి డీసెంట్ వసూళ్లు తేవడం తప్ప మరీ అద్భుతాలు ఎన్నడూ జరగలేదు. ఒక్క తుపాకీ మాత్రమే అంచనాలకు మించి ఆడింది. మిగిలినవన్నీ యావరేజే. అలాంటప్పుడు మాస్టర్ కి ఈ స్థాయిలో థియేటర్లు దొరకడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇదంతా అనూహ్యంగా కనిపిస్తోంది. నిన్న రాత్రి బయటికి వచ్చిన కొన్ని లీకు వీడియోలను టీం వెంటనే అలెర్ట్ అయిపోయి వెంటనే డిలీట్ చేయించింది.

ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్ల ప్లానింగ్ వల్ల రేపు మొత్తం మాస్టర్ హడావిడితో మోతమోగనుంది. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఎల్లుండి రాబోయే రెడ్, అల్లుడు అదుర్స్ కి కొంత చిక్కు తప్పదు. నిజానికి మన రెండు తెలుగు సినిమాలు 14నే క్లాష్ కాకుండా ఒకరు 13న మాస్టర్ తో తలపడి ఉంటే బాగుండేది. అప్పుడు మాస్టర్ వసూళ్ళలో భాగం మనకూ దక్కేది. ఇప్పుడు అలా కాకపోవడంతో మాస్టర్ కు ఫ్రీ గ్రౌండ్ దొరికింది. క్రాక్ ఎలాగూ కొంత చల్లారింది కాబట్టి ఉదయం నుంచి రాత్రి దాకా మాస్టర్ తప్ప ఇంకే మాట వినపడేలా లేదు. విజయ్ కు ఇది మంచి ఛాన్స్.

అదేదో సామెత చెప్పినట్టు పిల్లి పిల్లి గొడవ పడితే మధ్యలో ఇంకేదో వచ్చి రొట్టె ఎత్తుకుపోతుందట. అలా ఉంది టాలీవుడ్ పరిస్థితి. ఒకరితో ఒకరు మనం మనం ఢీ కొట్టుకోవడం ఇప్పుడు డబ్బింగ్ సినిమాకు మేలు చేకూరుస్తోంది. ఇక్కడే ఇలా ఉంటే తమిళనాడులో పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు. టికెట్ల కోసం అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. కరోనానే సిగ్గుపడేలా బుకింగ్ కౌంటర్ల దగ్గర జనం తొక్కిసలాట భీభత్సంగా ఉంది. బ్లాక్ లో అత్యధికంగా ఎనిమిది వేల రూపాయల దాకా ప్రీమియర్ టికెట్ పలికిందని చెన్నై టాక్. సో రేపు జరగబోయే రచ్చ మాములుగా ఉండేలా లేదు. ఖైదీ తర్వాత లోకేష్ కనగ రాజ్ దర్శకత్వం వహించిన సినిమా ఇదే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp