మాస్ అంటే మజాక్ కాదు అల్లుడు

By iDream Post Jan. 15, 2021, 08:19 pm IST
మాస్ అంటే మజాక్ కాదు అల్లుడు

నిన్నటితో సంక్రాంతి రిలీజులన్నీ పూర్తయ్యాయి. అన్నింటి గురించి రివ్యూలు రిపోర్టులు పబ్లిక్ టాకులు బయటికి వచ్చాయి. విన్నర్ ఎవరో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే గత కొన్నేళ్ళలో దేనికీ రానంత నెగటివ్ ఫీడ్ బ్యాక్ అల్లుడు అదుర్స్ మూటగట్టుకుంది. రొటీన్ కథతో ఎన్నోసార్లు చూసేసి అరిగిపోయిన కామెడీతో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దీన్ని తీర్చిదిద్దిన విధానం విమర్శలకు తావిచ్చింది. అసలు ఇంతోటి కథలో ఏముందని అన్ని కోట్లు ఖర్చు పెట్టారనే కామెంట్స్ కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అతి బిల్డప్పులతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని ఏదో సూపర్ హీరోగా ప్రొజెక్ట్ చేయాలనుకున్న ప్లాన్ రివర్స్ కొట్టింది.

నిజానికి మాస్ ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలను కోరుకోరు. వాళ్లకు కావాల్సింది యాక్షన్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్. అవి కూడా అర్థవంతంగా ఉండాలి. అంతే తప్ప జబర్దస్త్ కన్నా కింది స్థాయి జోకులను తీసుకొచ్చి డబ్బులిచ్చి చూడమంటే అంతకన్నా కామెడీ మరొకటి ఉండదు. నిన్న జరిగింది అదే. ఎంత పండగ సీజన్ అయినా ప్రతి సినిమాను ప్రేక్షకులు నెత్తిన బెట్టుకోరు. గతంలో ఇలాంటి సంక్రాంతికి వచ్చిన డిజాస్టర్ సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. మినిమమ్ కంటెంట్ ఉంటే ఏదో సెలవుల వల్ల గట్టెక్కుతాయి కానీ ఇలా అర్థం లేని ట్రీట్మెంట్ తో ఆడియన్స్ ని తక్కువ అంచనా వేస్తే ఏమమవుతుందో అల్లుడుకి తెలిసి వచ్చింది.

ఇప్పుడు సాయి శ్రీనివాస్ నేలవిడిచి సాము చేయడం మానేస్తే బెటర్. రాక్షసుడుతో అందుకున్న సక్సెస్ ని నిలబెట్టుకోకుండా మళ్ళీ రివర్స్ గేర్ లో వెళ్తున్నాడు. అసలు జూనియర్ ఎన్టీఆర్ లాగానో, రామ్ చరణ్ లాగానో మాస్ హీరోగా సెటిల్ కావాలని ఎందుకింత తాపత్రయపడుతున్నాడో అర్థం కావడం లేదు. అది కూడా తక్కువ టైంలో. అల్లుడు అదుర్స్ లాంటివాటి వల్ల ఆర్థికంగా నిర్మాతకే కాదు ఇమేజ్ పరంగా తనకు ఎంత డ్యామేజ్ జరుగుతుందో గుర్తిస్తే మంచిది. బ్యాక్ గ్రౌండ్ కాదు కష్టాన్ని చూడమన్న ఈ హీరో కొంచెం కథల వైపు కూడా సీరియస్ గా దృష్టి సారిస్తే మంచిది. ఇలాంటి సినిమాలు భస్మాసుర హస్తల్లాంటివి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp