Akhanda : మాస్ ప్రేక్షకుల ఆశలన్నీ ఈ సినిమా మీదే

By iDream Post Nov. 15, 2021, 10:18 am IST
Akhanda : మాస్ ప్రేక్షకుల ఆశలన్నీ ఈ సినిమా మీదే

నిన్న సాయంత్రం అఖండ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్ద హంగామా ఈవెంట్ చేయడం లాంటిదేమీ లేకుండా నేరుగా ఆన్ లైన్ లోకి వదిలేయడం ఆశ్చర్యం కలిగించినా బాలయ్య రేంజ్ స్టార్ హీరోకు ఇలాంటి ఆర్భాటాలు అవసరం లేదనిపించిన మాట వాస్తవం. సోషల్ మీడియాలో ఈ వీడియో తాలూకు పిక్స్, బైట్స్ హోరెత్తిపోయాయి. మరోసారి బోయపాటి శీను తన మార్కు ఊర మాస్ యాంగిల్ ని బయటికి తీశాడని అభిమానులు సంబరపడుతున్నారు. మూడు షేడ్స్ లో బాలకృష్ణ పాత్ర కనిపిస్తుండగా ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో ఆయన చేసింది డ్యూయల్ రోల్. అఘోరా తప్ప మిగిలిన వాటి డీటెయిల్స్ ని సీక్రెట్ గా ఉంచుతున్నారు.

మొత్తానికి అంచనాలు రేపడంలో అఖండ ట్రైలర్ సక్సెస్ అయ్యింది కానీ మాస్ కొంత ఓవర్ డోస్ అయిందేమోనని అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళు లేకపోలేదు. బాలయ్య తనవరకు విశ్వరూపం చూపించాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా డైలాగులు చెప్పడంలో మాస్ కి పూనకాలు తెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. కాకపోతే వినయ విధేయ రామా తరహాలో ఇందులో ఓవర్ ది బోర్డు హీరోయిజం లేకపోతే మేలని ఫ్యాన్సే అంటున్నారు. సింహా, లెజెండ్ లో వీటిని పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేసిన బోయపాటి శీను ఇందులోనూ అదే రిపీట్ చేస్తే బ్లాక్ బస్టర్ ఖాయం. శ్రీకాంత్, జగపతిబాబు తదితరుల గెటప్ లు మంచి ఎగ్జైట్మెంట్ కలిగిస్తున్నాయి

సెకండ్ లాక్ డౌన్ తర్వాత బాలయ్య రేంజ్ హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద రాలేదు. అందుకే డిసెంబర్ 2 కోసం ట్రేడ్ ఆశగా ఎదురు చూస్తోంది. అప్పటిదాకా మధ్యలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు. నవంబర్ 19ని అన్నీ చిన్న చిత్రాలే కాగా 29కి రాజ్ తరుణ్, కీర్తి సురేష్ లాంటి మీడియం బడ్జెట్ మూవీసే ఉన్నాయి. సో అఖండ కనక కరెక్ట్ గా కనెక్ట్ అయితే వసూళ్ల ఊచకోత ఖాయం. ముఖ్యంగా బిసి సెంటర్ల ఎగ్జిబిటర్లు ఆకలితో ఉన్నారు. అఖండతో మొదలు డిసెంబర్ లో పుష్ప 1, శ్యామ్ సింగ రాయ్ ఇలా మాస్ జాతర గట్టిగా ఉంది. బాలయ్య కనక బోణీ కొడితే ఇక టికెట్ కౌంటర్లు కళకళలాడటం చూడొచ్చు. చూద్దాం బోయపాటి ఏం చేశారో

Also Read : RRR : 52 రోజుల టైంతో రాజమౌళి టీమ్ పరుగులు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp