మినీ కథ హీరో మరో కథ

By iDream Post Jun. 09, 2021, 05:30 pm IST
మినీ కథ హీరో మరో కథ
ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజైన ఏక్ మినీ కథ హీరో సంతోష్ శోభన్ మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇది మారుతీ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతుందని ఇన్ సైడ్ టాక్. డైరెక్టర్ ఈయనేనా మరొకరా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. దీనికి 'మంచి రోజులు వచ్చాయి' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారని వినికిడి. హీరోయిన్ గా మెహ్రీన్ నటించబోతోంది. కేవలం ముప్పై రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ తో టీమ్ రెడీగా ఉందని సమాచారం. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశాక వేగంగా జరిపేలా ఆల్రెడీ షెడ్యూల్ సిద్ధం చేశారట. ఇది ఏ ప్లాట్ ఫార్మ్ కోసమనేది మాత్రం క్లారిటీ లేదు. ఆహా లేదా ప్రైమ్ రెండింటిలో ఒకటి కావొచ్చు.

మెహ్రీన్ పెళ్ళయాక ఒప్పుకున్న సినిమా ఇదే అవుతుంది. ఆల్రెడీ ఎఫ్3 షూటింగ్ లో ఉంది. మరికొన్ని ఆఫర్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడీ టైటిల్ చూస్తుంటే ప్రతి రోజు పండగే టైపు లో ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది. గోపిచంద్ తో ప్రస్తుతం పక్కా కమర్షియల్ చేస్తున్న మారుతీ దాని షూటింగ్ స్వింగ్ లో ఉండగానే లాక్ డౌన్ వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ గ్యాప్ తో పాటు గత ఏడాది దొరికిన సమయంలో మంచి రోజులు వచ్చాయితో పాటు మరికొన్ని కథలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇకపై ఒక్కొక్కటిగా కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెబ్ మూవీ కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవు.

చూస్తుంటే ఇకపై కూడా ఈ ఓటిటి సినిమాల ప్రవాహం కొనసాగేలా ఉంది. అందులోనూ డిజిటల్ సంస్థలు తాము స్వంతంగా నిర్మించే వాటి మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. మారుతీ లాంటి బ్రాండెడ్ డైరెక్టర్స్ అయితే ఎక్కువగా రీచ్ ఉంటుంది కాబట్టి ఇవి సెట్స్ పైకి వెళ్లడంలో పెద్దగా ఆలస్యం జరగడం లేదు.ఇకపై థియేటర్ కు ఓటిటిలకు విడివిడిగా సినిమాలు రూపొందిన ఆశ్చర్యం లేదు. ట్రెండ్ అలా మారిపోతోంది మరి. ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతున్న సంతోష్ శోభన్ కు ఏక్ మినీ కథ ఇచ్చిన మినీ బ్రేక్ ఇప్పుడీ మంచి రోజులతో పెద్ద బ్రేక్ గా మారుతుందేమో చూడాలి
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp