రామ్ చరణ్ తో బాండింగ్ అలాంటిది

By iDream Post Jun. 24, 2020, 07:48 pm IST
రామ్ చరణ్ తో బాండింగ్ అలాంటిది

అప్పుడప్పుడు మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబులు పరస్పరం స్టేజి మీద చిన్న చిన్న చిలిపి తగవులు చేసుకుంటారు కానీ నిజానికి ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో ఇప్పటికీ అభిమానులు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. ఇటీవలే చిరు మోహన్ బాబుకి బుగ్గ మీద ఆప్యాయంగా ముద్దు పెట్టడం కూడా హై లైట్ అయ్యింది. మరి వీళ్ళ పిల్లలకు ఎలాంటి రిలేషన్ ఉందనే అనుమానం రావడం సహజం. కానీ అలాంటిదేమి లేదట. రామ్ చరణ్, మంచు మనోజ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సాధారణంగా బయట ఓపెనింగ్స్ కి ఎక్కువగా రాని చరణ్ కొన్ని నెలల క్రితం మనోజ్ కొత్త సినిమా అహం బ్రహ్మాస్మి ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా వచ్చాడు.

ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. తమ మధ్య బాండింగ్ ఎప్పుడూ చాలా బలంగా ఉంటుందని చెబుతూ ఏదైనా డాడీస్ మధ్య ఉంటే అది తమకు సంబంధం లేదని మేమూ మేమూ చాలా క్లోజ్ గా ఉంటామని క్లారిటీ ఇచ్చేశాడు. దానికో ఉదాహరణ కూడా ఉందండోయ్. మంచు మనోజ్ నటించిన గుంటూరోడు పోస్ట్ ప్రొడక్షన్ లో జరుగుతుండగా పవర్ ఫుల్ ఇమేజ్ ఉన్న మాస్ స్టార్ తో వాయిస్ ఓవర్ చెప్పిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మనోజ్ కు వచ్చింది. వెంటనే చరణ్ కు ఫోన్ చేశాడు. అయితే ఆ సమయంలో చెర్రీ హైదరాబాద్ లో లేడు. 2వ తేది వస్తానని అప్పుడు చేద్దామని ప్రామిస్ చేశాడు. కానీ అప్పటికే రిలీజ్ డేట్ 3వ తేదీకి ఫిక్స్ చేసి ప్రకటించారు కూడా. దీంతో అయ్యో అనుకున్నారు ఇద్దరు.

కాసేపయ్యాక మనోజ్ కు ఇంకో ఐడియా వచ్చింది. ఉదయం చిరంజీవితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడానికి నాన్న మోహన్ బాబు బయలుదేరుతూ ఉండగా తాను వస్తానని మనోజ్ చెప్పడంతో ఆయన ఓకే అన్నారు. అక్కడికి వెళ్ళాక మనోజ్ తన మనసులో ఉన్న వాయిస్ ఓవర్ కోరిక బయట పెట్టేశాడు. దీంతో చేద్దామని చెప్పిన చిరంజీవి ఆ మరుసటి రోజే స్టూడియోకు వెళ్ళిపోయి డబ్బింగ్ పూర్తి చేసి మనోజ్ కు మెసేజ్ పెట్టారు. దీంతో షాక్ అవ్వడం మనోజ్ వంతైంది. అడగ్గానే ఇంత వేగంగా స్పందించిన చిరంజీవిని చూశాక తమ కుటుంబాల మధ్య ఎంత అనుబంధం ఉందో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇదంతా స్వయంగా మనోజే పంచుకున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp