ఆహా లో రానున్న మలయాళం హిట్

By Satya Cine Aug. 01, 2020, 08:00 pm IST
ఆహా లో రానున్న మలయాళం హిట్

ఈమధ్య ఓటీటీ వేదికలలో సినిమాలు రిలీజ్ చేయడం చాలా కామన్ గా మారింది. చిన్న బడ్జెట్, మీడియం బడ్జెట్ సినిమాలు, కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీ బాట పడుతున్నాయి. అల్లు అరవింద్ సొంత ఓటీటీ వేదిక ఆహా వారు కూడా పెరిగిన మార్కెట్ డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు ఒరిజినల్ వెబ్ సిరీస్ లతో, కొత్త సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆహ లో అందుబాటులో ఉన్న 'కృష్ణ అండ్ హిస్ లీల', 'భానుమతి రామకృష్ణ' లాంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా మరో సినిమా ఆహా లో రిలీజ్ కానుంది

మలయాళంలో రిలీజై విజయం సాధించిన 'ట్రాన్స్' సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆగస్టు 7వ తారీఖున ఆహలో అందుబాటులోకి రానుంది. అన్వర్ రషీద్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా తప్పనిసరిగా మెప్పిస్తుందని ఆహా నిర్వాహకులు భావిస్తున్నారు.

గతంలో కంటే ఈ మధ్య మలయాళం చిత్రాలకు ఆదరణ భారీగా పెరిగింది అయినప్పటికీ కంటెంట్ కు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు కావడంతో భాషతో సంబంధం లేకుండా అందరూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మరి ఈ సినిమా కూడా అలానే ప్రేక్షకుల మెప్పు పొందుతుందేమో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp