విజయ్ హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ?

By iDream Post Jun. 10, 2021, 11:44 am IST
విజయ్ హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ?
టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. ఓ ఇద్దరు ముగ్గురు తప్ప పెద్దగా ఆప్షన్లు ఉండటం లేదు. పోనీ వాళ్లనే రిపీట్ చేద్దామంటే మొనాటనీ అయిపోతుంది. అందుకే ఇతర బాషల నుంచి తెచ్చుకోవడం తప్పడం లేదు. అక్కడికీ సమస్య పరిష్కారం కావడం లేదు.  ఇప్పటికిప్పుడు అగ్ర హీరోల సరసన టాప్ హీరోయిన్ కావాలంటే అయితే పూజా హెగ్డే లేదా రష్మిక మందన్న అన్నట్టుంది పరిస్థితి. మిగిలిన వాళ్ళ మార్కెట్ ఇమేజ్ రెండూ ఆ స్థాయిలో లేకపోవడం సమస్యగా మారింది. ఇప్పుడు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాకూ ఈ తిప్పలు తప్పడం లేదు. ఇంకా షూటింగ్ మొదలుకానప్పటికీ క్యాస్టింగ్ పనులు చూస్తున్నారు

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో హీరోయిన్ గా విజయ్ మాస్టర్ లో నటించిన మాళవిక మోహనన్ పేరు పరిశీలిస్తున్నారట. మహేష్ కూడా పాజిటివ్ గా స్పందించడంతో త్వరలో తనను కలిసే అవకాశాలు ఉన్నాయి. మాళవిక మోహనన్ గ్లామర్ తో మెరిసిపోయే గొప్ప అందగత్తె కాదు కానీ ఒక గమ్మత్తైన ఆకర్షణ తనలో ఉంది. మాస్టర్ లో యాక్టింగ్ పరంగా పెద్దగా స్కోప్ దక్కలేదు. అంతా విజయ్ వన్ మ్యాన్ షో అయిపోవడంతో పెర్ఫార్మన్స్ పరంగా హై లైట్ కాలేకపోయింది.త్రివిక్రమ్ ముందుబ రష్మికనే అనుకున్నప్పటికీ ఆల్రెడీ తను సరిలేరు నీకెవ్వరూ లో చేసింది కాబట్టి ఫ్రెష్ బ్యూటీ కోసం చూసి మాళవిక దగ్గర ఆగారని తెలిసింది

ఇది అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది, ఇంకా సర్కారు వారి పాట షూటింగే సగం కూడా పూర్తి కాలేదు. నలభై శాతం దాకా ఆగుతూ సాగుతూ కరోనా వల్ల రెండు సార్లు బ్రేకులు వేసుకుంది. ఎలా చూసుకున్నా డిసెంబర్ దాకా ఫినిషయ్యేలా లేదు. అయితే 2022 సంక్రాంతికి రిలీజ్ అవుతుందా లేదా అనేది మాత్రం చాలా సమీకరణాల మీద ఆధారపడి ఉంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దుబాయ్ షెడ్యూల్ కోసం టీమ్ ఎదురు చూస్తోంది. పరిస్థితులు చిక్కబడ్డాక వీలైనంత వేగంగా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. చూడాలి మరి
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp