మెగా రీమేక్ కు రిపేర్లు అవసరమే

By iDream Post Jul. 20, 2021, 12:00 pm IST
మెగా రీమేక్ కు రిపేర్లు అవసరమే

భారీ అంచనాల మధ్య నిన్న రాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ లో నారప్ప స్ట్రీమింగ్ మొదలైపోయింది. సోషల్ మీడియా ఫీడ్ బ్యాక్ చూస్తుంటే నిన్న అర్ధరాత్రికే భారీ వ్యూస్ వచ్చినట్టుగా అర్థమవుతోంది. అందరూ నిద్ర మేల్కొని చూసి ఉండరు కాబట్టి ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం చాలా ఉంది. నారప్పకు వచ్చిన టాక్ పాజిటివ్ గానే ఉన్నప్పటికీ మరీ ఇదొక అద్భుతమని, కల్ట్ క్లాసిక్ అని ఎవరూ చెప్పడం లేదు. బాగుంది, వెంకీ నటన ప్లస్ ఆ పాత్రకు తగ్గట్టుగా ఆయన పడిన కష్టం కోసం ఖచ్చితంగా చూడాలనే అభిప్రాయం వ్యక్థమవుతోంది తప్ప రంగస్థలం తరహాలో రిపీట్ వేల్యూ ఉన్న యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలవడం మీద అనుమానాలను కొట్టిపారేయలేం

ఇప్పుడు దీనికి లూసిఫర్ కి లింక్ ఏమిటి అనుకుంటున్నారా. నారప్పని మక్కికి మక్కి ఒరిజినల్ ని ఫాలో అయిపోయి తెలుగు ఆడియన్స్ సెన్సిబిలిటీస్ ని పరిగణనలోకి తీసుకుకోకుండా దించేశారు. అలా కాకుండా స్క్రీన్ ప్లేలో కొంచెం వేగం పెంచి చిన్న చిన్న మార్పులు చేసి నిడివి తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. సరే ఇప్పుడు లూసిఫర్ రీమేక్ చేయబోతున్న చిరంజీవి ఈ అంశాలను ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే సుమారు మూడు గంటలు సాగే ఒరిజినల్ వెర్షన్ లో ల్యాగ్ ఎక్కువగా ఉంటుంది. హీరో ఎంట్రీనే అరగంట తర్వాత ఉంటుంది. మరీ అంత ఆలస్యం అయితే ఇక్కడి అభిమానులు ఒప్పుకోరు

దానికి తోడు హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యింది కానీ మన ఆడియన్స్ కి జీర్ణం కాని కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవన్నీ యాజిటీజ్ గా తీయలేం. అందుకే లూసిఫర్ రీమేక్ కు రిపేర్లు చాలా అవసరం. నారప్ప ఓటిటిలో వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ ఒకవేళ థియేటర్లో అయ్యుంటే భారీ వసూళ్లు సాధ్యమయ్యేవా అంటే చెప్పలేని పరిస్థితి. వెంకటేష్ కే ఇలా అయితే ఇక చిరంజీవి రేంజ్ మెగాస్టార్ రీమేక్ అన్నప్పుడు ఇంకా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ఆచార్య చివరి లెగ్ షూటింగ్ లో ఉన్న చిరు ఆ వెంటనే లూసిఫర్ రీమేక్ లో జాయిన్ అవుతారు. దీనికి రెండు మూడు టైటిల్స్ పరిశీలిస్తున్నారు కానీ ఇంకా ఏదీ ఫైనల్ చేయలేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp