మహేష్ ఛాయస్ శర్వానందే

By iDream Post Jun. 25, 2020, 02:35 pm IST
మహేష్ ఛాయస్ శర్వానందే

జిఎంబి ఎంటర్ టైన్మెంట్ పేరుతో స్వంతంగా ప్రొడక్షన్ హౌస్ కలిగిన సూపర్ స్టార్ మహేష్ బాబు తాను మాత్రమే నటించేవి కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అడవి శేష్ హీరోగా రూపొందుతున్న మేజర్ షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. లాక్ డౌన్ రాకపోయి ఉంటే ఆగస్ట్ లో రిలీజయ్యేది. ప్రస్తుతానికి పెద్ద బ్రేకే పడింది. సోనీ సంస్థతో కలిసి దీన్ని నిర్మిస్తున్న మహేష్ బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదు. హీరో మార్కెట్ తో సంబంధం లేకుండా సబ్జెక్టు మీద నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఆర్మీ మేజర్ బయోపిక్ కాగానే నెక్స్ట్ తీయాల్సిన సినిమాల గురించి మహేష్ అప్పుడే చర్చలు మొదలుపెట్టారట.

అందులో భాగంగా శర్వానంద్ హీరోగా ఓ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అధికారికంగా తెలిసే అవకాశం లేకపోయినా ఫిలిం నగర్ టాక్ అయితే జోరుగా ఉంది. లాక్ డౌన్ అయ్యాక దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావొచ్చు. శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కొంత భాగం మినహాయించి ఇది దాదాపు పూర్తయ్యింది. వ్యవసాయం బ్యాక్ డ్రాప్ లో దీన్నో డిఫరెంట్ పాయింట్ తో తీర్చిద్దినట్టు సమాచారం. దీని సంగతలా ఉంచితే మహేష్ బాబు ప్లాన్ చేసిన సినిమాకు దర్శకుడు ఎవరై ఉండొచ్చనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు. వ్యక్తిగతంగా సర్కారు వారి పాటను ప్రకటించి దాని రెగ్యులర్ షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్న మహేష్ ఈలోగా తన ప్రొడక్షన్ ప్లానింగ్ కి సంబంధించిన వ్యవహారాలు వీడియో కాల్స్ ద్వారా చేస్తున్నట్టు తెలిసింది.

వ్యక్తిగతంగా తనను ఎవరూ కలవకుండా నియంత్రించుకుని ఇంటికే పరిమితమైన ప్రిన్స్ అక్కడి నుంచి ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నట్టు వినికిడి. మొత్తానికి ఇంట్లో వాళ్ళతో కావాల్సినంత టైం గడుపుతూనే సినిమా వ్యవహారాలు కూడా చక్కబెట్టుకుంటున్న స్టార్లు కరోనా పుణ్యమాని సెట్ కి టెన్షన్ కి దూరంగా సమయాన్ని ఖర్చు పెడుతున్నారు. సోషల్ మీడియాలో అందరూ ఏదో ఒకరూపంలో దర్శనం ఇస్తున్నారు కానీ శర్వానంద్ మాత్రం బొత్తిగా కనిపించడం మానేశారు. శ్రీకారం షూటింగ్ తిరిగి మొదలుపెట్టే దాకా బయటికి రాడేమో. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను ఇలా వరసగా హ్యాట్రిక్ డిజాస్టర్ల తర్వాత గట్టి హిట్టు కోసం చూస్తున్న శర్వానంద్ కు ఆ కోరిక కనీసం శ్రీకారం అయినా తీరుస్తుందేమో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp