కార్పొరేట్ కంపెనీలన్నింటికీ మహేషే కావాలి

By iDream Post Sep. 25, 2021, 02:30 pm IST
కార్పొరేట్ కంపెనీలన్నింటికీ మహేషే కావాలి

ఇప్పుడంతా బ్రాండింగ్ కాలం. సినిమా స్టార్లు దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే తరహాలో కార్పొరేట్ సంస్థల కోసం యాడ్స్ లో నటించడం, వాటికి అంబాసడర్లుగా వ్యవహరించడం సహజం. ఈ తంతు ఎక్కువగా బాలీవుడ్ లోనే ఉండేది. అమితాబ్ అమీర్ లాంటి వాళ్ళతో యాడ్స్ చేసినప్పుడు వాటితోనే దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నార్త్ కన్నా సౌత్ సినిమా డామినేషన్ పెరిగిపోయింది. బాహుబలి నుంచి టాలీవుడ్ సత్తా నలుమూలలా పాకిపోయింది. మీడియం రేంజ్ హీరోల డబ్బింగ్ హక్కులు సైతం 20 కోట్ల దాకా పలుకుతున్నాయంటే అంతకంటే సాక్ష్యం ఏం కావాలి. యాడ్స్ లో కూడా పాన్ ఇండియాలు వస్తున్నాయి.

ఇక విషయానికి వస్తే ఇండియన్ టాప్ మోస్ట్ కార్పొరేట్ బ్రాండ్స్ అన్నీ ఇప్పుడు మహేష్ బాబు జపం చేస్తున్నాయి. తమ ఉత్పత్తుల కోసం ఎంత ఖర్చైనా పర్లేదు అనే స్థాయిలో కోట్లాది రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. నిన్న బిగ్ సి కోసం మహేష్ ప్రత్యేకంగా ఈవెంట్ చేయడం, అందులో భాగంగా మీడియాతో పాటు ఇతర వర్గాల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. మొన్నీమధ్యే ఫ్లిప్ కార్ట్ యాడ్స్ లో మహేష్ విస్తృతంగా కనిపిస్తున్నాడు. పాన్ బహార్ ప్రమోటింగ్ చేయడం పట్ల కామెంట్స్ వచ్చినప్పటికీ దాని ప్రభావం అంతగా ఉండేలా కనిపించడం లేదు

ఇప్పుడు తెలుగు వరకు చూసుకుంటే మహేష్ అంత మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ అంబాసడర్ వేరొకరు లేరు. ముందు నుంచి చూసుకుంటే పై రెండు మాత్రమే కాకుండా థంప్స్ అప్, ప్రో వోగ్, ఐడియా సెల్యులార్, ఇంటెక్స్, టాటా స్కై, సంతూర్, టివిఎస్ మోటార్స్, అమృతాంజన్, రాయల్ స్టాగ్, వివెల్ అల్ట్రా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జాన్ అలుక్కాస్ లాంటివి చాంతాడంత లిస్టులో ఉన్నాయి. వీటిని కొన్ని ఒప్పందం పూర్తయినవి కాగా మరికొన్ని కొనసాగిస్తున్నవి ఉన్నాయి. సినిమాలకు ఉండేంత రిస్క్ లేకపోవడమే కాక తక్కువ టైంలో ఎక్కువ మొత్తం లభిస్తుండటం కూడా మహేష్ ఇన్నేసి చేయడానికి కారణం. క్రేజ్ ఉన్నప్పుడు, తన బొమ్మను చూసే ఆయా కంపెనీల వస్తువులను కొంటున్నప్పుడు ఏ స్టార్ అయినా ఇలా చేయడం న్యాయమేగా

Also Read : బోలెడు ధైర్యాన్నిచ్చిన లవ్ స్టోరీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp