వసూల్ రాజాగా మహేష్ బాబు ?

By iDream Post Jun. 03, 2020, 10:39 am IST
వసూల్ రాజాగా మహేష్ బాబు ?

గీత గోవిందం తర్వాత రెండేళ్లకు పైగా వచ్చిన గ్యాప్ కు సార్ధకం కలిగేలా మహేష్ బాబుతో సర్కారు వారి పాట ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు పరశురాం సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. అందివచ్చిన సమాచారం మేరకు సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగేలా ప్లానింగ్ అయ్యిందట. సంక్రాంతి 2021కి వచ్చే ఛాన్స్ లేదు. బడ్జెట్ భారీగానే పెడుతున్నందున హడావిడిగా చేసే బదులు వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టే షెడ్యూల్స్ చేసినట్టుగా తెలిసింది. ప్రీ లుక్ వచ్చాక అంచనాలు బాగా పెరిగాయి. టైటిల్ తో పాటు వెనుక నుంచి కట్ చేసిన మహేష్ రఫ్ లుక్ కి సోషల్ మీడియాలో బ్రహ్మాండమైన స్పందన దక్కింది.

మెడ వెనుక రూపాయి టాటూ మీద ఇప్పటికే రకరకాల కథనాలు వచ్చాయి. తాజాగా వస్తున్న అప్ డేట్ ప్రకారం మహేష్ బాబు ఇందులో వసూల్ రాజా తరహా పోషిస్తున్నాడట. అప్పులిచ్చి వాటిని వసూలు చేసుకునే టైపులో అవుట్ అండ్ అవుట్ మాస్ గా ఉంటుందట. సాధారణంగా ఇలాంటి క్యారెక్టర్లు విలన్లు చేస్తారు. కాని ఇక్కడ హీరో చేస్తున్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. దీనికి తోడు బలమైన ఫాదర్ సెంటిమెంట్ సర్కార్ వారి పాటకు పెద్ద ప్లస్ కాబోతోందని చెబుతున్నారు. తండ్రిగా ఏ నటుడు కనిపిస్తారో అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ప్రకాష్ రాజ్ పేరు వినిపిస్తోంది కానీ ఓ సీనియర్ బాలీవుడ్ నటుడిని తెచ్చే అవకాశాలు లేకపోలేదు.

హీరొయిన్ విషయం కూడా గుట్టుగా ఉంచుతున్నారు. కీర్తి సురేష్ లేదా కీయరా అద్వాని పేర్లే వినిపిస్తున్నాయి. మహానటే ఫిక్స్ అవ్వొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే తమన్ మ్యూజిక్ సిటింగ్స్ మొదలుపెట్టారు. త్వరలో హీరో దర్శకుడితో మీటింగ్ కూడా ఉండబోతోంది. సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ అయినా అందులో ఏదో మిస్ అయ్యిందనే ఫీలింగ్ అభిమానుల్లో ఉంది. అందుకే అల వైకుంఠపురములోని దాటలేకపోయిందని అభిప్రాయపడ్డారు. ఆ కారణంగానే సర్కార్ వారి పాటలో ఏదీ మిస్ కాకుండా పరశురాం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు వినికిడి. మొత్తానికి మాంచి మాస్ ఎంటర్ టైనర్ రావడమైతే ఖాయమని తేలిపోయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp