మహేష్ 27 షాకింగ్ టైటిల్ ?

By iDream Post May. 27, 2020, 01:31 pm IST
మహేష్ 27 షాకింగ్ టైటిల్ ?

సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత రెగ్యులర్ రెస్ట్ తో పాటు లాక్ డౌన్ వల్ల మొత్తం కలిపి ఏకంగా ఐదు నెలల బ్రేక్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ సినిమా ఈ నెల 31న ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ టీమ్ నుంచి అఫీషియల్ గా ఈ న్యూస్ రానప్పటికీ నిప్పు లేనిదే పొగరాదు తరహాలో ప్రచారమైతే జోరుగా సాగుతోంది. దీనికి గీత గోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టైటిల్ లీక్ జోరుగా షికారు చేస్తోంది. 'సర్కార్ వారి పాట' అని ప్రచారం జరుగుతోంది.

సాధారణంగా వేలం పాటల్లో ప్రభుత్వం తరఫున మొదలుపెట్టే మాట ఇది. దీన్ని టైటిల్ గా పరిగణిస్తున్నారంటే ఏదో ఇంటరెస్టింగ్ పాయింట్ ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఏ జానర్ లో కథ ఉంటుందనే క్లూ అయితే ఇప్పటిదాకా బయటికి రాలేదు. నిజమో కాదో కానీ టైటిల్ మాత్రం సోషల్ మీడియాలో హంగామా చేయడం మొదలుపెట్టింది. మహేష్ ఫ్యాన్స్ తమ హీరో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడన్న ఉత్సుకతతో ఇప్పటికే పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. మరో టాక్ ని బట్టి ఇందులో హీరో పేరే సర్కార్ అని వినికిడి. తాను ఎక్కడికి వెళ్లినా తనదే పైచేయి అనేలా ప్రిన్స్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని, ఇంతకు ముందు చూడని తరహాలో పరశురాం దీన్ని తీర్చిదిద్దబోతున్నట్టు సమాచారం.

అది మాఫియానా లేక వేరే బ్యాక్ డ్రాప్ లో ఉంటుందా వేచి చూడాలి. హీరోయిన్ గా కీర్తి సురేష్, కియారా అద్వానీ పేర్లు వినిపిస్తున్నాయి కానీ నిజానికి యూనిట్ దృష్టిలో ఎవరున్నారో ఇంకా సీక్రెట్ గానే ఉంది. కృష్ణ గారి పుట్టినరోజు కాబట్టి సింపుల్ గా పూజా కార్యక్రమాలతో దీన్ని మొదలుపెట్టే అవకాశం ఉంది. సెంటిమెంట్ ప్రకారం మహేష్ దీనికి హాజరు కాకపోవచ్చట. తనకు బదులుగా నమ్రత హాజరవ్వొచ్చు. ఇంకో 4 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ వచ్చేస్తుంది. లుక్స్ పరంగానూ మహేష్ ఏదో ప్రయోగం చేస్తున్నట్టే ఉంది. ఇంట్లో పిల్లలతో గడుపుతున్న ఫోటోలు చూస్తే అదే అనిపిస్తోంది. మొత్తానికి మహేష్ 27 చాలా విభిన్నంగా ఉండబోతోందన్న మాట తెలిసింది. సో ఇక అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సి ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp