థ్రిల్లింగ్ అండ్ కిల్లింగ్ 'మధ'

By iDream Post Mar. 11, 2020, 12:43 pm IST
థ్రిల్లింగ్ అండ్ కిల్లింగ్  'మధ'

చిన్న సినిమాలకు జనాన్ని ఆకర్షించడం పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో సెలెబ్రిటీలు సైతం మాట్లాడుకునేలా చేసిన చిత్రం మధ. విడుదలకు ముందే బోలెడు అవార్డులు తన ఖాతాలో వేసుకున్న మధ ఎల్లుండి అంటే 13న విడుదల కాబోతోంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఇది మూవీ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. కంటెంట్ కన్నా ముఖ్యంగా మధను డైరెక్ట్ చేసిన దర్శకురాలు శ్రీవిద్య బసవ చేసిన సినీయుద్ధం ఇప్పటికే ఆన్ లైన్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఒక మహిళ అయ్యుండి కేవలం ఒంటి చేత్తో సినిమాను తీసి విడుదల దాకా తీసుకురావడం గురించి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి సెలెబ్రిటీలు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మెచ్చుకోలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో అంచనాలు మెల్లగా ఎగబాకుతున్న మధ ఫ్రైడే రేస్ లో హైప్ పరంగా దూసుకుపోతోంది. తొలుత క్రేజ్ లేనప్పటికీ ప్రమోషన్ వల్ల థ్రిల్లర్ జానర్ ని ఇష్టపడే వాళ్లకు మధ మంచి ఛాయస్ అవుతోంది. ఇది ఒక అమ్మాయి జీవితంలో చెలరేగిన మానసిక సంఘర్షణకు సంబంధించిన కథ. ప్రేమించినవాడితో జీవితం ఎంతో సుఖంగా ఉంటుందని కలలు కంటున్నా తనకు ఊహించని ఉత్పాతం ఎదురవుతుంది.

తన చుట్టూ ఉన్న పరిస్థితులే విష వలయంగా మారతాయి. ప్రాణాల మీదకు వస్తుంది. ఆఖరికి తనను పిచ్చాసుపత్రిలో చేర్చే దాకా తీసుకెళ్తుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది, ఇల్లే ఓ నరకకూపంగా ఎలా అయ్యింది లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి. ఇప్పటికే శ్రీవిద్య బసవ ఉత్తమ దర్శకురాలిగా 8 అవార్డులు సొంతం చేసుకుంది. వివిధ విభాగాల్లో టెక్నికల్ గానూ పురస్కారాలు దక్కాయి. ఈ లెక్కన చూస్తుంటే మధ చిన్నగా ప్రారంభమై పెద్ద సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది. త్రిష్ణ ముఖర్జీ అంతా తానై లీడ్ రోల్ పోషించిన మధలో ఇతర కీలక తారాగణం ఉన్నప్పటికీ ఫోకస్ అంతా తన మీదే ఉండేలా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో రూపొందిన మధ బాక్స్ ఆఫీస్ ఫలితం ఇంకో రెండు రోజుల్లో తేలనుంది

Watch Trailer Here @ bit.ly/39FyyjF

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp