రజనీ లిస్ట్ లో లక్కీ డైరెక్టర్స్

By iDream Post Mar. 24, 2020, 09:45 pm IST
రజనీ లిస్ట్ లో లక్కీ డైరెక్టర్స్

దర్బార్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికి సూపర్ స్టార్ రజనీకాంత్ స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తన 168వ సినిమా అన్నాతే(తెలుగు టైటిల్ ఫిక్స్ కాలేదు) షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ తీసుకున్న తలైవా దీని తర్వాత మరో రెండు సినిమాలు ఆల్మోస్ట్ ఒకే చేసినట్టు చెన్నై అప్ డేట్. కార్తీ ఖైదీతో టాక్ ఆ ది ఇండస్ట్రీగా మారిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ రజని 169 టేకప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇతను విజయ్ తో రూపొందించిన మాస్టర్ విడుదలకు రెడిగా ఉంది.

ఒకవేళ కరోనా తాకిడి లేకపోతే ఏప్రిల్ 6న మాస్టర్ వచ్చేసేది. దీని ఫలితంతో సంబంధం లేకుండా రజని ఆఫర్ ఒకే అయినట్టుగా తెలిసింది. ఇప్పటిదాకా విభిన్నమైన కథలతో అలరించిన లోకేష్ రజని కోసం ఎలాంటి సబ్జెక్ట్ రెడీ చేశాడా అనే ఆసక్తి రేగుతోంది. ఇక 170 విషయానికి వస్తే డాన్స్ మాస్టర్ లారెన్స్ తో దాదాపుగా ప్రాజెక్ట్ ఖాయమైనట్టేనని సమాచారం. లారెన్స్ నిజానికి మంచి టాలెంట్ ఉన్న మాస్ డైరెక్టర్. మొదటి చిత్రం మాస్ తో పాటు ఆ తర్వాత తీసిన స్టైల్, డాన్ లోనూ తనదైన మార్క్ చూపించాడు.

కానీ ఎందుకో తమిళ్ లో ముని పేరుతో హారర్ జానర్ లో సూపర్ హిట్ కొట్టాడో ఇక అక్కడి నుంచి అందులో నుంచి బయటికి రాలేక వరసగా సీక్వెల్స్ తీస్తూనే ఉన్నాడు . తీసిన కథనే మళ్ళి మళ్ళి చూపిస్తున్నా బిసి సెంటర్ల అండతో కమర్షియల్ హిట్స్ అందుకుంటున్నాడు. ఇప్పుడు తాను ప్రాణంగా ప్రేమించే రజనికాంత్ తో సినిమా అంటే ఏ రేంజ్ లో చూపిస్తాడో ఊహించుకోవచ్చు. వరసగా క్రేజ్ ఉన్న దర్శకులతో సినిమాలైతే చేస్తున్నాడు కానీ రజని తన రేంజ్ అయిన బాషా, నరసింహ లాంటి సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఈ ఇద్దరైనా ఏదైనా బ్రేక్ ఇస్తారేమో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp