శర్వా శ్రీకారంకు లక్కీ ఛాన్స్

By iDream Post Aug. 02, 2020, 01:43 pm IST
శర్వా శ్రీకారంకు లక్కీ ఛాన్స్

కొన్నిసార్లు అనుకోకుండా టైం కలిసి వస్తుంది. ముందు దాన్ని నెగటివ్ గా చూసినా అదే పాజిటివ్ గా మారడం అప్పుడప్పుడు మాములే. శర్వానంద్ కు లాక్ డౌన్ ఇంకో రకంగా ప్లస్ అవుతోంది. ఎలా అంటారా. జానుతో కలిపి హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వాకు ఆశలన్నీ రాబోయే శ్రీకారం మీదే ఉన్నాయి. నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి డెబ్యుగా రూపొందుతున్న ఈ మూవీ రైతు సమస్యల మీద రూపొందుతోంది. వాస్తవానికి ఇది ఏప్రిల్ లోనే రావాల్సి ఉంది. ఏదో షూటింగ్ లో డిలే వల్ల వాయిదా వేశారు. జూన్ లేదా జూలై అనుకునేలోపే మార్చ్ నుంచి అన్ని షూటింగులు బ్రేక్ పడ్డాయి.

దీంతో ఇంకొంత పార్ట్ మాత్రమే బాలన్స్ ఉన్న శ్రీకారం పరిస్థితి నార్మల్ అవ్వడం కోసం ఎదురు చూస్తోంది. ఎలా చూసినా ఈ ఏడాది ధియేటర్లలో విడుదల చేసే అవకాశం లేదు. థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోవడానికి ఎంత లేదన్నా అక్టోబర్ అయ్యేలా ఉంది. అప్పటికి క్యు కట్టిన సినిమాలు చాలా ఉన్నాయి, వి, రెడ్, అరణ్య తదితరాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి శ్రీకారం ఆ టైంకంతా పూర్తి చేసుకున్నా సరైన డేట్ దొరికే ఛాన్స్ లేదు. దీంతో ఇప్పుడీ మూవీని 2021 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. పెద్ద చిత్రాలన్నీ బరిలో నుంచి తప్పుకున్నట్టే. ఆచార్య, వకీల్ సాబ్ కూడా వచ్చేలా లేవు. ఇక ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుకోకపోతే మంచిది. అయితే శ్రీకారంతో పాటు పండక్కు నితిన్ రంగ్ దే, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

అందుకే ఫెస్టివల్ సీజన్ కుర్ర హీరోలతో సందడిగా మారడం ఖాయం . అయితే ఎవరూ విడుదల తేదీలు ఖరారుగా ప్రకటించలేదు. కరోనా కేసుల విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఎవరూ నిర్ణయాలు ప్రకటించలేకపోవచ్చు. అయితే ఈ ముగ్గురు రావడం మాత్రం దాదాపు కన్ఫర్మ్ అనే చెప్పొచ్చు. గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియ ఆరుళ్ మొహన్ హీరొయిన్ గా నటిస్తున్న శ్రీకారంకు మిక్కి జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. గ్రామీణ సమస్యలను కొత్త కోణంలో చూపించబోతున్నారని ఇప్పటికే ఇన్ సైడ్ టాక్ బలంగా ఉంది. సంక్రాంతికి వచ్చే సినిమాల్లో కంటెంట్ కాస్త అటుఇటుగా ఉన్నా వసూళ్లు మాత్రం ఘనంగా ఉంటాయి. అందుకే శ్రీకారంకు లక్కీ ఛాన్స్ అన్నది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp