చైతు సినిమాకు మళ్ళీ బ్రేక్

By iDream Post Apr. 08, 2021, 07:11 pm IST
చైతు సినిమాకు మళ్ళీ బ్రేక్

కరోనా తాలూకు సెగలు టాలీవుడ్ కు మళ్ళీ మొదలయ్యాయి. పక్కన కర్ణాటక, తమిళనాడులో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు మరోసారి గడ్డుకాలం మొదలుకాగా అది ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉండటంతో భారీ సినిమాల నిర్మాతలు ఒక్కొక్కరుగా వెనుకడుగు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కు వస్తున్న రెస్పాన్స్ చూశాకైనా మనసు మార్చుకుంటారేమో అనుకుంటే అలాంటిదేమి జరగలేదు. లవ్ స్టోరీని కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఏప్రిల్ 16న ప్లాన్ చేసిన డేట్ ఇప్పుడు ఖాళీ అయిపోయింది. ఆ రోజున వర్మ దెయ్యం తప్ప ప్రస్తుతానికి ఎలాంటి రిజర్వేషన్లు లేవు. కాబట్టి ఎవరైనా వస్తారేమో చూడాలి. గత పది రోజులుగా కరోనా ఉదృతంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో పరిస్థితి తీవ్రంగా మారడంతో ఇక్కడ కూడా భయాలు మొదలయ్యాయి. దాంతో ఫ్యామిలీస్ థియేటర్లకు రావడం మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అందుకే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని ఆసియన్ అధినేతలు ఈ కారణాలు చెప్పారు.

ఇప్పుడీ ప్రకటన ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఆపై వారం టక్ జగదీశ్ ఉంది. మొన్నటి దాకా ప్రమోషన్లు గట్టిగా చేశారు కానీ ఇకపై ఏం చేస్తారో చూడాలి. నెలాఖరున విరాటపర్వం ఆపై పాగల్ లు లైన్ లో ఉన్నాయి. ఇవి క్రాక్, రెడ్ లాగా ధైర్యం చేస్తాయా లేక లవ్ స్టోరీ బాట పడతాయా చూడాలి. నాగ చైతన్య-సాయి పల్లవి-శేఖర్ కమ్ముల క్రేజీ కాంబోలో రూపొందిన లవ్ స్టోరీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. నిరాశపడాల్సిన అవసరం లేదని ఎప్పుడు వచ్చినా మెప్పించే కంటెంట్ ఉందని నిర్మాత భరోసా ఇస్తున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp