మరో హిలేరియస్ ఎంటర్ టైనర్ రాబోతోంది

By iDream Post Apr. 06, 2021, 04:00 pm IST
మరో హిలేరియస్ ఎంటర్ టైనర్ రాబోతోంది

కొన్నేళ్ల క్రితం పిట్టగోడ అనే సినిమా వచ్చి డిజాస్టర్ అయినప్పుడు కనీసం ఆ దర్శకుడి పేరు కూడా ఎవరికీ గుర్తు లేదు. కొన్ని రివ్యూలు మంచి ప్రయత్నమని మెచ్చుకున్నాయి కానీ టీవీలో వచ్చినప్పుడు కూడా ఎవరూ పట్టించుకోనంత దారుణంగా ఫెయిల్ అయ్యింది. కానీ దాని దర్శకుడు ఎవరూ ఊహించని రీతిలో బౌన్స్ బ్యాక్ అవుతాడని మాత్రం ఎవరు చెప్పారు. కానీ అనుదీప్ విషయంలో అదే జరిగింది. స్టార్లు లేకుండా కేవలం ముగ్గురు ఆర్టిస్టులను నమ్ముకుని సింపుల్ కామెడీతో జాతిరత్నాలు రూపొందించిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులతో వాహ్ అనిపించింది. తక్కువ టైంలో ముప్పై కోట్ల షేర్ ని అందుకోవడం అంటే మాటలు కాదు.

ఇప్పుడు ఇతను నెక్స్ట్ ఏ మూవీ చేయబోతున్నాడనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వైజయంతి సంస్థకే మరో కమిట్ మెంట్ ఇచ్చాడు కాబట్టి ఆ బ్యానర్ లోనే ఉంటుంది. అయితే హీరో ఎవరనే క్లారిటీ మాత్రం రావడం లేదు. ముందు వైష్ణవ్ తేజ్ పేరు వినిపించింది. ఆ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ అన్నారు. ఏదీ కన్ఫర్మ్ గా తెలియలేదు. ఇప్పుడేమో మళ్ళీ నవీన్ పోలిశెట్టితోనే ఉండొచ్చు అంటున్నారు. కానీ అనుదీప్ మాత్రం ఎక్కడా బయట పడటం లేదు. కనీసం ఏ సబ్జెక్టు మీద వర్క్ చేస్తున్నాననే క్లూ ఇవ్వడం లేదు. జాతిరత్నాలు ఫైనల్ రన్ అయిపోవస్తోంది కాబట్టి ఇకనైనా వివరాలు చెబుతాడేమో చూడాలి.

అనుదీప్ తో నాలుగో సినిమా కోసం అగ్ర నిర్మాతలు కూడా వెయిటింగ్ లో ఉన్నారు. స్టార్లు ఇప్పటికిప్పుడు పిలిచే పరిస్థితి లేదు కానీ మీడియం రేంజ్ హీరోలు మాత్రం అనుదీప్ తో ఛాన్స్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ ఇచ్చే కిక్ ఏ రేంజ్ లో ఉంటుందో అనుదీప్ ఎంజాయ్ చేస్తున్నాడు. జాతిరత్నాలు వేడి బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చల్లారిపోయింది. కలెక్షన్లు కూడా దాదాపు ఫైనల్ స్టేజికి వచ్చేశాయి. ఇంకో మూడు రోజుల్లో వకీల్ సాబ్ వచ్చేస్తుంది కాబట్టి దాదాపు సెలవు తీసుకున్నట్టే. ప్రైమ్ లో త్వరలో వరల్డ్ ప్రీమియర్ కాబోతోంది. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో మరో హిలేరియస్ ఎంటర్ టైనర్ అనుదీప్ సిద్ధం చేసుకున్నట్టు ఇన్ సైడ్ న్యూస్.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp