ఉప్పెన హీరోతో కింగ్ ప్లాన్

By iDream Post Feb. 26, 2021, 09:10 pm IST
ఉప్పెన హీరోతో కింగ్ ప్లాన్

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో ఓపెనింగ్స్ విషయంలో రామ్ చరణ్ రేంజ్ లో గ్రాండ్ వెల్కమ్ దక్కించుకున్న వైష్ణవ్ తేజ్ ఇప్పుడు హాట్ కేక్ గా మారాడు. నిర్మాతలు క్యూ కడుతున్నారు. దర్శకులు కథలు సిద్ధం చేసుకుంటున్నారు. కుర్రాడిలో విషయముందని ఉప్పెనలో ఋజువు కావడంతో మంచి ఆఫర్లతోనే ప్రతిపాదనలు పెడుతున్నారు. మొదటి సినిమా ఇంత పెద్ద హిట్టవుతుందని బహుశా వైష్ణవ్ తేజ్ అయినా ఊహించాడో లేదో. దెబ్బకు ఓటిటి కోసమని ప్లాన్ చేసుకున్న క్రిష్ డైరెక్షన్ లో మూవీ కాస్తా ఇప్పుడు థియేట్రికల్ కోసం రెడీ అవుతోంది. డేట్ ఇంకా సెట్ చేయలేదు కానీ ఆల్రెడీ హాట్ బిజినెస్ డీల్స్ వేచి చూస్తున్నాయి.

తాజా అప్ డేట్ ప్రకారం మూడో సినిమాను కింగ్ అక్కినేని నాగార్జున నిర్మాతగా రూపొందబోతున్నట్టు తెలిసింది. ఈ వార్త గత వారమే బయటికి వచ్చినప్పటికీ ఇప్పుడు గట్టి అడుగులు పడుతున్నాయట. మరో కొత్త దర్శకుడు దీని ద్వారా పరిచయం కాబోతున్నట్టు తెలిసింది. పేరు బయటికి చెప్పలేదు కానీ ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేయడం లాంటి పనులు పూర్తయ్యాయని ఇన్ సైడ్ టాక్. అన్నపూర్ణ స్టూడియోస్, గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్మెంట్స్ కాకుండా నాగ్ స్థాపించిన మరో బ్యానర్ మనం ఎంటర్ టైన్మెంట్ మీద ఇది రూపొందబోతోంది. అన్నీ సిద్ధమయ్యాక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బహుశా వచ్చే నెల ఉండొచ్చు.

ఈ లెక్కన చూస్తే వైష్ణవ్ అన్నయ్య సాయి తేజ్ కంటే వేగంగా దూసుకుపోయేలా ఉన్నాడు. ఉప్పెన రేంజ్ లో మరో గట్టి హిట్టు పడితే మార్కెట్ స్టాండర్డ్ అయిపోతుంది. నాగ్ ఇలా మెగా హీరోతో చేయడానికి కారణం ఏదైనా మంచి ఆలోచనే అని చెప్పాలి. ఎంతసేపు ఎవరి ఫ్యామిలీ హీరోలతో వాళ్లే తీసుకుంటూ ఉంటే ఎలా. ఇవాళ ఉప్పెన ఘనవిజయం సందర్భంగా మైత్రి అధినేతలు వైష్ణవ్, కృతి శెట్టిలకు ప్రత్యేకంగా నగదు కానుకలు చెక్కు రూపంలో అందజేశారు. ఎంత మొత్తమని బయటికి చెప్పలేదు కానీ రెమ్యునరేషన్ల కంటే ఎక్కువేనని వినికిడి. మొత్తానికి ఉప్పెన పుణ్యమాని ఈ ఇద్దరి రేంజ్ మాత్రం ఎక్కడికో వెళ్లిపోయింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp