రంగంలోకి దిగిన కింగ్ నాగార్జున

By iDream Post Aug. 01, 2020, 11:33 am IST
రంగంలోకి దిగిన కింగ్ నాగార్జున

షూటింగులు ఎప్పుడు మొదలవుతాయో అర్థం కానీ పరిస్థితిలో కింగ్ నాగార్జున మొదటి అడుగు వేసేశారు. బిగ్ బాస్ 4 ప్రోమోకు సంబంధించిన షూట్ లో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా జాగ్రత్తల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో తక్కువ మంది సభ్యులు ఉండేలా ముందే ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. ఈ యాడ్ టెలికాస్ట్ కూడా అతి త్వరలోనే ఉండబోతోంది. ఆర్ఆర్ఆర్ కెమెరామెన్ సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో దీన్ని చిత్రీకరించారట. మొత్తానికి చిన్నదే అయినా అడుగు మాత్రం పెద్దదిగానే ఉండబోతోంది.గత నాలుగు నెలలుగా వైరస్ దెబ్బకు ఇళ్లకే పరిమితమైన స్టార్ హీరోలు, యాక్టర్లు ఎవరూ సెట్లకు వచ్చేందుకు సిద్ధంగా లేరు.

ఈ క్రమంలో నాగ్ ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకోవడం సాహసమే. అందరు పిపిఈ కిట్లు ధరించేలా టీమ్ మొత్తం ముందే సెట్ చేసుకుంది. కింగ్ కు మేకప్ వేసే మెంబెర్స్ సైతం హాస్పిటల్స్ లో డాక్టర్ల తరహా వేషధారణలో ఉండటం గమనార్హం. ఇది చిన్న నిడివి అడ్వర్టైజ్మెంట్ కాబట్టి కొంచెం సులభంగా అనిపించొచ్చు కానీ వాస్తవానికి ఇదే తరహా కేర్ కాస్త పెద్ద స్కేల్ లో తీసుకుంటే పెద్ద సినిమాలకు సైతం ఈ ఫార్ములాని అప్లై చేయొచ్చు. కాకపోతే ఆడంబరాలు, అతిశయోక్తులు తగ్గించుకోవాలి అంతే. ఈ లెక్కన నాగార్జున బాలన్స్ ఉన్న వైల్డ్ డాగ్ సినిమాను కూడా త్వరలో రీ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది అయ్యాక ప్రవీణ్ సత్తారుతో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ మొదలుపెట్టాలి. ప్రస్తుతం దీని స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉంది యూనిట్.

సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజూకు సంబంధించిన క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ 4 విషయానికి వస్తే ఇది వచ్చే నెల మొదటివారం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టిసిపెంట్స్ ని ఫైనల్ చేసే పనులు జరుగుతున్నాయి. గతంలో కాకుండా ఈసారి లిస్టు లీక్ కాకుండా స్టార్ మా ఛానల్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. అంతా జూమ్ మీటింగ్స్ లోనే సెలక్షన్ చేస్తున్నారట. పక్కా ప్లానింగ్ తో పాల్గొనే వాళ్లకు కరోనా టెస్టులు చేయించాక హౌస్ లోకి తీసుకెళ్లబోతున్నారు. అది ఎప్పుడు ఎలా ఏ తేదీలో అనేది తెలియాలంటే మాత్రం ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. అన్నట్టు మరి నాగార్జున స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు స్టార్లు ముందుకు వస్తారో లేక ఇంకొద్ది రోజులు ఆగుతారో చూద్దాం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp