ఎప్పుడూ చూడని వేషంలో షా'కింగ్'

By iDream Post Aug. 13, 2020, 10:50 am IST
ఎప్పుడూ చూడని వేషంలో షా'కింగ్'

ఆరు పదుల వయసు వచ్చినా ఇప్పటికీ మన్మధుడి పేరుకి సార్ధకం చేస్తూ గ్లామర్ మైంటైన్ చేస్తున్న అక్కినేని నాగార్జున సందడి బుల్లితెరపై మొదలైపోయింది. బిగ్ బాస్ ప్రోమోలతో నిన్నటి నుంచి హంగామా స్టార్ట్ చేశారు. అయితే ఇప్పటిదాకా ఎన్నడూ చూడని లుక్ లో నాగ్ అభిమానులకే కాదు ప్రేక్షకులకూ షాక్ ఇచ్చారు. మొత్తం తెల్లని జుట్టు, మీసాలతో టెలిస్కోప్ నుంచి ఏదో రహస్యాన్ని చూస్తూ గోపి అని పిలవడం వెరైటీగా ఉంది. అంటే హౌస్ లో పార్టిసిపెంట్స్ చేయబోయేవన్నీ తాను చూడబోతున్నట్టు హింట్ ఇచ్చేశారు. సీజన్ 4కి భారీ రేటింగ్స్ ఆశిస్తున్న స్టార్ మా దానికి తగ్గట్టే డిఫరెంట్ ప్రమోషన్స్ ని ప్లాన్ చేసుకుంటోంది.

ఎలాగైనా దీన్ని గత మూడు భాగాల కంటే పెద్ద హిట్టు చేయాలన్న లక్ష్యం గట్టిగానే కనిపిస్తోంది. కమింగ్ సూన్ అన్నారు కాని తేదీ ఎప్పుడు అనేది అందులో పేర్కొనలేదు. సెప్టెంబర్ కన్నా ముందు వచ్చే అవకాశాలు లేనట్టే. సెలెక్ట్ కాబడిన వాళ్ళంతా ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉన్నారు. వాళ్ళకు కరోనా టెస్టులు పూర్తి చేశాకా అన్నపూర్ణ స్టూడియోలోని హౌస్ సెట్ లోకి పంపబడతారు. అయితే లిస్టు మాత్రం లీక్ కాకుండా స్టార్ మా చాలా జాగ్రత్త పడుతోంది. అన్ని రంగాల మాదిరే లాక్ డౌన్ వల్ల శాటిలైట్ ఛానల్స్ సైతం తీవ్ర ఇబ్బందులు, నష్టాలు చవి చూశాయి. ఏవో కొన్ని సీరియల్స్ తప్ప మునుపటి స్థాయిలో చాలా వాటికీ ఆదరణ దక్కడం లేదు. అందుకే బిగ్ బాస్ 4తో సాలిడ్ హిట్ కొట్టే పనిలో ఉంది స్టార్ మా. నాగార్జున సైతం దీని కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నారట.

తన సినిమా షూటింగుల కన్నా ముందు దీనికే ప్రాధాన్యత ఇచ్చిన నాగ్ ప్రోగ్రాం జరుగుతున్నన్ని రోజులూ కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు టీంతో చర్చిస్తున్నారట. 90 నుంచి 100 రోజుల మధ్య జరిగేలా కార్యక్రమాన్ని ప్లాన్ చేశారని తెలిసింది. అయితే నాగార్జున వీకెండ్ లో ఒక రోజే వస్తారా లేదా రెండు రోజులు కనిపిస్తారా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సినిమాలకు సంబంధించి కూడా నాగ్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వైల్డ్ డాగ్ సగంలో ఆగిపోయింది. ప్రవీణ్ సత్తరు దర్శకత్వంలో మూవీ ఇంకా మొదలుపెట్టాలి. బంగార్రాజు గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. ఏది ఎలా ఉన్నా సీనియర్ హీరోల మధ్య ఈ ఏడాదిలో ఎక్కువగా కనిపించబోయేది నాగార్జునే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp