డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ తో కింగ్

By iDream Post May. 11, 2021, 06:00 pm IST
డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ తో కింగ్
వైల్డ్ డాగ్ తో థియేటర్లో ఓటిటిలో రెండు రకాల ఫలితాలు అందుకున్న నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగులన్నీ వాయిదా పడటంతో ఇది వచ్చే నెల లేదా జులైలో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్, స్టోరీ లీక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నిజమో కాదో కన్ఫర్మేషన్ లేకపోయినా ప్రచారం మాత్రం సాగుతోంది. దాని ప్రకారం ఇందులో నాగ్ మాజీ రా ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. అంటే ఒకరకంగా వైల్డ్ డాగ్ ఎక్స్ టెన్షన్ లాగా.

అయితే కథానుసారం ఈ పాత్ర విదేశాల్లో ఉంటుంది. ఎప్పుడో విడిపోయిన సోదరి ఇరవై ఏళ్ళ తర్వాత ఆపదలో చిక్కుకుని  తనను అందులో నుంచి బయట పడేయడం కోసం ఇండియాకు తిరిగి వచ్చి విలన్ల భరతం పట్టే కాన్సెప్ట్ తో ఇది రూపొందుతుందట. ఇది అవునో కాదో కానీ మొత్తానికి వినడానికి బాగానే ఉంది. నాగ్ ఇమేజ్ కు తగ్గట్టే మ్యాచ్ అయ్యే కంటెంట్ అనిపిస్తోంది. ఇక్కడికి వచ్చాకే తన కుటుంబం గురించి ఒక ట్విస్టు ఉంటుందట. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ చేస్తున్న ఈ మూవీ కోసం నాగ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కూడా తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. కత్తి యుద్ధాలు కూడా ఉంటాయట.

మొత్తానికి నాగ్ తన ఇమేజ్ వయసుకు తగ్గ కథల మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రవీణ్ సత్తారుకు కూడా ఇది హిట్ కావడం చాలా అవసరం. గరుడవేగా తర్వాత ఆ స్థాయిలో తన ముద్రవేయలేకపోయాడు. ఇప్పుడు నాగ్ తో ప్రాజెక్ట్ కనక సక్సెస్ అయితే మళ్ళీ ట్రాక్ లో పడొచ్చు. ఇది కాకుండా నాగ్ బిగ్ బాస్ 5తో పాటు బంగార్రాజు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే కరోనా దృష్ట్యా రియాలిటీ షో బాగా ఆలస్యమయ్యేలా ఉంది. బంగార్రాజు మాత్రం దసరాకు ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఇందులో నాగ చైతన్య కూడా ఉంటాడు. హీరోయిన్ టీమ్ సెలక్షన్ లో దర్శకుడు కల్యాణ కృష్ణ బిజీగా ఉన్నాడు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp