వెరైటీ టైటిల్స్ తో వస్తున్న కింగ్

By iDream Post Aug. 30, 2021, 12:30 pm IST
వెరైటీ టైటిల్స్ తో వస్తున్న కింగ్

కింగ్ ఖాన్ షారుఖ్ - దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా ఇంకా ప్రారంభం కాలేదు కానీ దాని తాలూకు విశేషాలు మాత్రం అప్పుడే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం మూడు బాషలకు మూడు టైటిల్స్ రిజిస్టర్ చేసినట్టుగా జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. అందులో తెలుగుకి కత్తి కొండల రాయుడు, తమిళం వేలుస్వామి మురుగన్, హిందీకి రాజవర్ధన్ ఠాకూర్ ని లాక్ చేశారట. మలయాళం, కన్నడ తాలూకు పేర్లు మాత్రం ఇంకా ఏమి అనుకోలేదని వినికిడి. పాన్ ఇండియా లెవెల్ లో మల్టీ లాంగ్వేజ్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు.

జీరో తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తీసుకున్న షారుఖ్ ప్రస్తుతం పఠాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదయ్యాక అట్లీ మూవీ రెగ్యులర్ షూట్ కి వెళ్తుంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించడం దాదాపు ఖరారే. అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు. సాన్యా మల్హోత్రా మరో కీలక పాత్రలో కనిపించనుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చడం కూడా లాంఛనమే. లైకా ప్రొడక్షన్స్ రెడ్ చిల్లీస్ రెండు బ్యానర్లు దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో షారుఖ్ డ్యూయల్ రోల్ చేస్తాడనే టాక్ ఉంది. అదిరింది, బిగిల్ తరహాలో అట్లీ దీన్ని కూడా అవుట్ అండ్ అవుట్ మసాలా ఎంటర్ టైనర్ గా తీస్తున్నారట.

ఇదంతా బాగానే ఉంది కానీ నేటివిటీ ఉట్టిపడేలా ఇలాంటి టైటిల్స్ ని షారుఖ్ సినిమాకు ఎంచుకోవడమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. డిడిఎల్ లాంటివి ప్రాంతీయ భాషల్లోనూ డబ్బింగ్ జరిగినా పేర్లు మాములుగానే ఉండేవి. ఇప్పుడీ కొండలరాయుడు అంటూ ఏదో పవన్ కళ్యాణ్ కి పెట్టిన రేంజ్ లో సెట్ చేయడమే వింత. ఒకపక్క సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లు దూసుకుపోతూ ఉంటే తమ హీరో మాత్రం ఇంతేసి గ్యాప్ తీసుకోవడం పట్ల అభిమానులు బాగా అసంతృప్తిగా ఉన్నారు. ఇకపై ఫ్యాన్, జీరో లాంటి ప్రయోగాలకు స్వస్తి చెప్పి పూర్తిగా మాస్ సబ్జెక్టులకే కింగ్ ఖాన్ ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది

Also Read : రాజమౌళి ఏదో ఒకటి తేల్చాల్సిందే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp