యాక్షన్ థ్రిల్లర్ లో రవితేజ

By iDream Post Apr. 12, 2021, 10:32 am IST
యాక్షన్ థ్రిల్లర్ లో రవితేజ

ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రాక్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఖిలాడీ శరవేగంగా పూర్తవుతోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం మరో ఆకర్షణ. పోస్టర్ల నుంచి ఇదో మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ అనే అభిప్రాయం కలిగించిన యూనిట్ టైటిల్ కు తగ్గట్టే ఇందులో భారీ ఛేజులు, పోరాట సన్నివేశాలు పొందుపరిచినట్టు గతంలో వచ్చిన ప్రమోషన్ మెటీరియల్ ని చూసినప్పుడే అర్థమైపోయింది. అంచనాలు మరింత పెంచే విధంగా ఇందాకే ఖిలాడీ టీజర్ ని విడుదల చేశారు. దాని విశేషాలేంటో చూద్దాం.

వీడియోని చాలా తెలివిగా కట్ చేశారు. ఎక్కడా సంభాషణలు లేకుండా కేవలం చివర్లో మాత్రమే ఓ ఇంగ్లీష్ డైలాగుని పెట్టి ముగించేశారు. కథకు సంబంధించి ఎలాంటి క్లూస్ లేకుండా జాగ్రత్త పడ్డారు. అన్ని ఫ్రేమ్స్ లో దాదాపు రవితేజ ఉండగా అక్కడక్కడా యాక్షన్ కింగ్ అర్జున్ ని రివీల్ చేశారు. హీరోయిన్లు మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలను కూడా దాచిపెట్టినట్టు చూపించారు. అనసూయ, రావు రమేష్, వెన్నెల కిషోర్, ముఖేష్ ఋషి ఇలా ఒక్కొక్కరు అలా కనిపించి ఇలా మాయమైపోతారు. చూస్తుంటే ఏదో రివెంజ్ డ్రామాలాగే అనిపిస్తోంది. టీజర్ మొత్తం ఇంటెన్సిటీతో నింపే ప్రయత్నం చేశారు

రవితేజ ఎప్పటిలాగే తన ఎనర్జీతో చెలరేగిపోయినట్టు క్లారిటీ వచ్చేసింది. కాకపోతే మొత్తం సీరియస్ గానే కనిపించడం ట్విస్ట్. ఇక మిగిలినవాళ్లు గురించి చెప్పడానికి ఏమి లేదు. ఖైదీ నెంబర్ 150 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కొంత స్లో చేసి వాడినట్టు ఉంది తప్ప దేవి బిజిఎంలో ఎలాంటి మెరుపులు లేవు. ఛాయాగ్రహణం ఇలాంటి వాటికి తగ్గ టోన్ లోనే సాగింది. మొత్తానికి ఏదో డిఫరెంట్ గా అనిపించింది కానీ మరీ భారీ ఉత్సుకత రేగే రేంజ్ లో ఖిలాడీ ఫీలింగ్ కలిగించలేదు. ట్రైలర్ కోసం దాచిపెట్టారేమో. టీజర్ లో హ్యాపీ ఉగాది అని విష్ చేశారు తప్ప ఇంతకు ముందు ప్రకటించిన మే 28 విడుదల తేదీని ఇందులో ఖరారు చేయలేదు

Teaser Link @ https://bit.ly/2RnghDr

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp