కెజిఎఫ్ 2 ప్లానింగ్ లో మార్పు ?

By Ravindra Siraj Feb. 05, 2020, 03:50 pm IST
కెజిఎఫ్ 2 ప్లానింగ్ లో మార్పు ?

మొన్న ఏడాది చివర్లో సైలెంట్ గా రిలీజై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న కెజిఎఫ్ ఇప్పుడు సీక్వెల్ రూపంలో ప్రేక్షకులను తెగ ఊరిస్తోంది. ఛాప్టర్ 2 పేరుతో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే కర్నూలు, కడప ప్రాంతాల్లో కొన్ని ఎపిసోడ్లు షూట్ చేసిన యూనిట్ తర్వాత మైసూర్ అటుపై గనుల సెట్ లో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాస్తవానికి ఇది కూడా ఫస్ట్ పార్ట్ లాగే 2020 చివర్లో విడుదల చేయాలనీ ప్లాన్ చేసుకున్నారు కాని ఇప్పుడు దాంట్లో మార్పు జరగొచ్చని శాండల్ వుడ్ అప్ డేట్.

దాని ప్రకారం అంత ఆలస్యంగా వచ్చే బదులు కేజిఎఫ్ 2ని జూలై 30నే బరిలో దింపే విధంగా ప్రణాళిక రచిస్తున్నట్టుగా తెలిసింది. ఈ తేది వినగానే ఏదో ఫ్లాష్ అవుతోంది కదూ. అవును రాజమౌళి క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ ఫిక్స్ చేసుకున్న ముహూర్తం అది. కాని అనుకున్న టైంలో ఆర్ఆర్ఆర్ పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్న ఆ స్లాట్ ని కేజిఎఫ్ 2 కోసం లాక్ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చలు జరుగుతున్నాయట. డిసెంబర్ అంటే అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాతో పాటు వేరే బాలీవుడ్ సినిమాల పోటీ విపరీతంగా ఉంది.

2018లో కేజిఎఫ్ 1 టైంలో వచ్చిన షారుఖ్ ఖాన్ జీరోతో పాటు తెలుగు తమిళంలో వచ్చిన ఇతర సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అది దానికి బాగా కలిసి వచ్చింది. ఇప్పుడూ అలా జరుగుతుందని అనుకోవడానికి లేదు కాబట్టి జూలై అయితే సమ్మర్ ని కూడా వాడుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఎలాగూ పాన్ ఇండియా లెవల్ లో కెజిఎఫ్ కు క్రేజ్ ఉంది కాబట్టి కాంపిటేషన్ లేకుండా వదిలితే ఇక రికార్డుల సంగతి వేరే చెప్పాలా. త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp