ప్రశాంత్ నీల్ జెండా ఇక్కడే

By iDream Post Mar. 10, 2021, 03:09 pm IST
ప్రశాంత్ నీల్ జెండా ఇక్కడే

మొన్నటిదాకా వందల కోట్ల మార్కెట్ లేని కన్నడ పరిశ్రమలో కేవలం రెండో సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లానింగ్ చూస్తుంటే ఇప్పట్లో టాలీవుడ్ వదిలిపోయేలా లేడు. మన హీరోలు వదిలే సూచనలు కూడా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రభాస్ అతన్ని సలార్ కోసం లాక్ చేసుకుని శరవేగంగా షూటింగ్ పూర్తి చేసేందుకు సహకరిస్తుండగా నెక్స్ట్ క్యూ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. తారక్ ఆర్ఆర్ఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అయ్యాక చేయబోయేది ప్రశాంత్ తోనే అని ప్రచారం బలంగా ఉంది. మైత్రి బ్యానర్ లో ఈ ఇద్దరికీ ఒక కమిట్ మెంట్ ఉంది.

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రేస్ లో జాయిన్ అవుతున్నట్టుగా తెలిసింది. నిన్న చావు కబురు చల్లగా ఈవెంట్ కోసం హైదరాబాద్ లోనే ఉన్న బన్నీని గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా కలిసి సమావేశం జరపడం చాలా ఊహాగానాలకు తెరతీసింది. అల వైకుంఠపురములో తర్వాత కెరీర్ ప్లానింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న బన్నీ నా పేరు సూర్య తరహాలో కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చి చేతులు కాల్చుకోవడానికి సిద్ధంగా లేడు. అందుకే కేవలం బ్రాండెడ్ డైరెక్టర్లను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రశాంత్ నీల్ తో మీటింగ్ జరిగి ఉండొచ్చని అభిమానుల అంచనా.

అటు కర్ణాటకలో చూస్తేనేమో కన్నడలో సినిమా తీసి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు పాన్ ఇండియా మాయలో పడిపోయి పక్క రాష్ట్రాల స్టార్లతోనే వరసగా చిత్రాలు తీస్తావా అంటూ అక్కడి భాషాభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయినా ప్రశాంత్ నీల్ ఇవన్నీ కేర్ చేసే పరిస్థితిలో లేడు. రాజమౌళి తర్వాత నార్త్ లోనూ దర్శకుడి ఇమేజ్ పరంగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దాన్ని ఇంకా బలోపేతం చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. కెజిఎఫ్ 2 జులై 16న విడుదల కానున్న నేపథ్యంలో దాని ఫలితం మీద ఇతను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దీని రిజల్ట్ కోసమే హీరో యష్ వెయిట్ చేస్తూ ఇంకా ఏ కొత్త సినిమా సైన్ చేయలేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp