ప్రభాస్ స్పెషల్ సాంగ్ అట్రాక్షన్

By iDream Post Mar. 16, 2021, 05:30 pm IST
ప్రభాస్ స్పెషల్ సాంగ్ అట్రాక్షన్

ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ స్టార్స్ లో ఒకడిగా మారిపోయిన ప్రభాస్ తాలూకు నాలుగు సినిమాల అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ఆల్రెడీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాధే శ్యామ్ రిలీజ్ ఆల్రెడీ కన్ఫర్మ్ కాగా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలవుతాయాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరోపక్క సలార్ షూటింగ్ కూడా బ్రేకులు లేకుండా నిర్విఘ్నంగా సాగుతోంది. ప్రశాంత్ నీల్ ఎక్కువ గ్యాప్ రాకుండా పక్కా ప్లానింగ్ తో తాను అనుకున్న టైం అండ్ బడ్జెట్ లోనే వేగంగా పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లు ముందే చేసుకుని రంగంలోకి దిగాడు. రిలీజ్ వచ్చే ఏడాది అయినప్పటికీ వీలైనంత త్వరగా ఫినిష్ చేసి డార్లింగ్ ని ఆది పురుష్ కోసం ఫ్రీ చేయాల్సి ఉంటుంది.

ఇక విషయానికి వస్తే సలార్ లో ఓ రేంజ్ లో కిక్కిచ్చే ఓ స్పెషల్ ఐటెం సాంగ్ ఉందట. దానికి కెజిఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని ఒప్పించినట్టు బెంగుళూరు టాక్. తనకు అంత పెద్ద బ్రేక్ ఇచ్చిన దర్శకుడు అడగటంతో ఆమె నో చెప్పలేకపోయినట్టు వినికిడి. అందులోనూ ప్రభాస్ సరసన డాన్స్ చేస్తే దానికొచ్చే గుర్తింపు ఇంకో లెవెల్ లో ఉంటుంది. అందుకే ఎస్ చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెజిఎఫ్ 2 ఇటీవలే పూర్తి చేసుకున్న ఈ భామ కన్నడలో మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్. అంతకు ముందే క్రేజ్ ఉన్నప్పటికీ దీని దెబ్బకు గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయింది. చాఫ్టర్ 2 తర్వాత ఇంకా డబుల్ అవుతుందని అంచనాలో ఉంది.

సో సలార్ కు ఆకర్షణలు పెరుగుతున్నాయి. హీరోయిన్ శృతి హాసన్ తప్ప ఇంకే గ్లామర్ ఉండేదేమో అని దిగులు పడుతున్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్. కాకపోతే అఫీషియల్ అయ్యేదాకా వేచి చూడాలి. అందాక ఇది నిజమని చెప్పలేం. దీని షూట్ అయ్యాక ప్రభాస్ ఆది పురుష్ కోసం ఎక్కువ సమయం కేటాయించబోతున్నాడు. ఇప్పుడు ముంబైలో దీని షూట్ లోనే బిజీగా ఉన్నాడు. కంప్లీట్ రెగ్యులర్ షూటింగ్ వేసవి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత నాగ అశ్విన్ డైరెక్షన్ లో చేయబోయే గ్రాండియర్ కు శ్రీకారం చుడతారు. మొత్తానికి రాబోయే మూడేళ్లు డార్లింగ్ ఫ్యాన్స్ కి మాములు పండగా కాదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp