పవన్ సరసన కేరళ కుట్టి

By iDream Post May. 13, 2020, 12:46 pm IST
పవన్ సరసన కేరళ కుట్టి

లాక్ డౌన్ వల్ల వకీల్ సాబ్, విరుపాక్ష షూటింగులకు బ్రేక్ తీసుకుని రెస్ట్ లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీటి తర్వాత గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్టు మొన్నే అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో అంచనాలు అప్పుడే ఎగబాకడం మొదలైంది. తాజాగా హీరొయిన్ కూడా ఫిక్స్ చేసే పనిలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు టాలీవుడ్ లో పూజా హెగ్డే, రష్మిక మందన్న తప్ప చెప్పుకోదగ్గ ఆప్షన్స్ లేకపోవడంతో హరీష్ శంకర్ కేరళ కుట్టిని తెచ్చే పనిలో పడ్డారట.

ఆమె పేరు మానస రాధాకృష్ణన్. మలయాళం ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా 2008లో కన్నీరునుం మధురం ద్వారా ఎంట్రీ ఇచ్చిన మానస 2016లో పౌలటంటే వీడుతో హీరొయిన్ గా డెబ్యు చేసింది. శివకార్తికేయన్ బలశాలితో తమిళ్ లో కూడా ప్రవేశించింది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది కాని ఏది పడితే ఆ కథ ఒప్పుకునే హీరొయిన్ కాదని తనకు పేరుంది. ఇప్పుడు హరీష్ శంకర్ తనను పవన్ 28లోకి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. ప్రాధమికంగా పాజిటివ్ సిగ్నల్ వచ్చిందని తెలిసింది.

షూటింగ్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి డేట్స్ విషయంలో మాట తీసుకునే పరిస్థితి లేదు. పవన్ ఎప్పుడు ఖాళీ అవుతాడో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ గ్యాప్ తర్వాత పవన్ సినిమాలతో పాటు రాజకీయ కార్యకలాపాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మానస రాధాకృష్ణన్ ఒప్పుకున్నా వచ్చే ఏడాది ఏ టైంలో కాల్ షీట్స్ అడగాలనే విషయంలో వెంటనే క్లారిటీ రాకపోవచ్చు. కేరళలోని ఎర్నాకులంలో పుట్టి దుబాయ్ లో పెరిగిన మాసనకు మంచి లుక్స్ తో పాటు ఆకర్షణీయమైన అందం ఉంది. ఇప్పుడీ న్యూస్ నిజమైతే పవన్ సరసన ఫ్రెష్ కాంబినేషన్ ని చూడొచ్చు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp