మహేష్ జోడి కీర్తినే : ఇక నో డౌట్స్

By iDream Post Oct. 17, 2020, 01:11 pm IST
మహేష్ జోడి కీర్తినే : ఇక నో డౌట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోయే సర్కారు వారి పాటలో హీరోయిన్ గా కీర్తి సురేష్ అఫీషియల్ గా లాకైపోయింది. ఈ మేరకు ట్విట్టర్లో దర్శకుడు హీరో స్వయంగా దీన్ని ధృవీకరించడంలో డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇవాళ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులకు ఈ గుడ్ న్యూస్ చెప్పేశారు. ఇది ఎప్పుడో లీకైనప్పటికీ ఏదైనా మార్పు ఉండొచ్చనేలా కొన్ని సంకేతాలు వచ్చాయి. దాని సమర్ధిస్తూ కానీ ఖండిస్తూ కానీ యూనిట్ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఇప్పుడు వీటికి చెక్ పెడుతూ యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో ఓ సందేహం తీరిపోయింది.

ఇప్పటికే అమెరికా వెళ్లి లొకేషన్స్ చూసుకొచ్చిన పరశురామ్ టీమ్ త్వరలోనే షెడ్యూల్స్ ని ప్లాన్ చేయబోతోంది. జనవరి నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. గత కొద్దిరోజులుగా సర్కారు వారి పాట పెండింగ్ లో ఉంటుందని. దానికన్నా ముందు మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తారనే పుకారు గట్టిగానే షికారు చేసింది. కానీ తాజా సమాచారం మేరకు అలాంటిదేమీ లేదట. సర్కారు వారి పాట పూర్తి స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయిపోయింది, తమన్ ట్యూన్స్ సిద్ధం చేశాడు, అన్ని చోట్లా షూటింగులకు అనువైన వాతావరణం నెలకొంది. అలాంటప్పుడు దీన్ని వాయిదా వేయాల్సిన అవసరమే లేదు. పైగా త్రివిక్రమ్ ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ కోసం సర్వం సిద్ధం చేసుకుని చూస్తున్నాడు. సో నో ఛాన్స్.

వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేసుకున్న సర్కారు వారి పాటను వేసవిలోగా పూర్తి చేసేలా పరశురామ్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఒకవేళ రెండు నెలలు అటు ఇటు అయినా 2021 దసరాకు రిలీజ్ చేసేలా చూస్తున్నారట. ఎలాగూ ఆ టైంకంతా పరిస్థితులు పూర్తిగా సద్దుమణుగుతాయి. ఎప్పటిలాగే థియేటర్లు ఫుల్ కెపాసిటీతో నడుస్తుంటాయి కాబట్టి వసూళ్ల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏ మాత్రం లేట్ ఐనాల సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ కు రెండేళ్లు గ్యాప్ వచ్చినట్టు అవుతుంది. అందుకే వీలైనంత వేగంగా షూట్ ని పూర్తి చేస్తారని సమాచారం. మిగిలిన క్యాస్టింగ్ తదితర వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp