మెగాస్టార్ సూపర్ స్టార్ ఇద్దరికీ ఒకే సోదరి

By iDream Post Sep. 26, 2021, 04:30 pm IST
మెగాస్టార్ సూపర్ స్టార్ ఇద్దరికీ ఒకే సోదరి

మహానటి తర్వాత సబ్జెక్టు సెలక్షన్లలో చేసిన పొరపాట్ల వల్ల మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు కానీ కీర్తి సురేష్ ఫాలోయింగ్ కి మాత్రం ఎలాంటి లోటు లేదు. ఆఫర్లు కూడా ఆగలేదు. గత ఏడాది పెంగ్విన్, మిస్ ఇండియా రూపంలో రెండు ఓటిటి డిజాస్టర్లు దక్కించుకున్న ఈ భామకు ఈ ఏడాది రంగ్ దే కూడా అంతగా అచ్చిరాలేదు. నితిన్ తో మొదటిసారి కట్టిన జోడి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితేనేం మహేష్ బాబు సర్కారు వారి పాట చేతిలో ఉంది. ఇది కనక బ్లాక్ బస్టర్ పడితే మరోసారి కమర్షియల్ వింగ్ లో తను బిజీ అయిపోవచ్చు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న గుడ్ లక్ సఖి ఇంకా విడుదల కావాల్సి ఉంది.

ఇక విషయానికి వస్తే కీర్తి సురేష్ కు ఒక అరుదైన ఘనత దక్కింది. తను ప్రస్తుతం వేదాళం రీమేక్ భోళా శంకర్ లో చిరంజీవి చెల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ముందు సాయి పల్లవి నో చెప్పాకే ఈమె ఎస్ చెప్పింది. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా. రజినికాంత్ అన్నాతేలో కూడా కీర్తి సురేష్ చేస్తోంది చెల్లి పాత్రే. అది సవతి తల్లి బిడ్డగా. ఇలా ఒకే టైంలో ఇక్కడ మెగాస్టార్ కి అక్కడ సూపర్ స్టార్ కి చెల్లెలిగా నటించడం విశేషమేగా. భోళా శంకర్ రెగ్యులర్ షూట్ ఇంకా ప్రారంభం కాలేదు. అన్నాతే పూర్తయ్యింది కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉందట. దీపావళికి రావడం అనుమానమే అంటున్నారు.

ఈ విశేషాన్ని కీర్తి సురేష్ ఇంకా చెప్పుకోలేదు. అన్నాతే విషయంలో బయటికి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు కాబట్టి అందులో భాగంగా తను షేర్ చేయలేదు కానీ లీకైన సోర్స్ ని బట్టి ఇది బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ లోనే సాగుతుందట. మోహన్ లాల్ తో చేసిన మరక్కార్ రిలీజ్ మళ్ళీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కేరళలో పరిస్థితులు ఇంకా కుదుటపడక పోవడంతో పోస్ట్ పోన్ చేశారు. మరో తమిళ సినిమా సాని కడియం ఓటిటి లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మలయాళంలో వాశి అనే సినిమా కూడా కీర్తి చేస్తోంది. మొత్తానికి మూడు భాషల్లో బాగా బిజీగా ఉండటంతో పాటు అరుదైన ఘనతలను కీర్తి సురేష్ సొంతం చేసుకుంటోంది

Also Read : వెంకటేష్ సినిమా గురించి ఫ్యాన్స్ టెన్షన్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp