Bimbisara : బాహుబలి రేంజ్ లో నందమూరి హీరో పాత్ర

By iDream Post Nov. 29, 2021, 12:30 pm IST
Bimbisara : బాహుబలి రేంజ్ లో నందమూరి హీరో పాత్ర

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా బింబిసార ముస్తాబవుతోంది. విడుదల డిసెంబర్ లోనే అన్నారు కానీ ఇంకా దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు. 24న శ్యామ్ సింగ రాయ్ ఒకటే ఉన్ననేపధ్యంలో దాంతో పోటీ పడొచ్చనే అంచనాలు ఉన్నాయి. వరుణ్ తేజ్ గని వాయిదా దాదాపు ఖరారైనట్టే. ఇందాక బింబిసార టీజర్ ని రిలీజ్ చేశారు. మల్లాది వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ కం ఫాంటసి డ్రామాలో క్యాథెరిన్ త్రెస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్లు నటిస్తున్నారు. చోటా కె నాయుడు సంగీతం, చిరంతన్ భట్ సంగీతం అందించారు. టెక్నికల్ టీమ్ ని గట్టిగానే సెట్ చేసుకున్న ఈ గ్రాండియర్ మీద కళ్యాణ్ రామ్ కు చాలా ఆశలు ఉన్నాయి.

క్యాప్షన్ ని బట్టి చూస్తే ఇది టైం ట్రావెల్ కథనే క్లారిటీ వచ్చేసింది. వందల శతాబ్దాల క్రితం తన రాజ్యం కోసం ఎంతకైనా తెగించే ఏ హింసకైనా సిద్ధపడే బింబిసార అనే చక్రవర్తికి, ఇప్పటి వర్తమానంలో అదే పోలికలతో ఉన్న ఓ యువకుడి జీవితానికి లింక్ ఏంటనే పాయింట్ మీద నడుస్తుందనే క్లూ అయితే ఇచ్చారు. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ వర్క్ లో కూడా స్టాండర్డ్ కనిపిస్తోంది. బాహుబలి రేంజ్ లో బిల్డప్, యుద్ధ సన్నివేశాలు భారీగా సెట్ చేశారు. బింబిసారగా కళ్యాణ్ రామ్ లుక్స్ బాగున్నాయి. ఇప్పటిదాకా చేయని క్యారెక్టర్ కావడంతో ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యే ఛాన్స్ ఉంది. కంటెంట్ కీలకం కానుంది.

మొత్తానికి తన మీద అంచనాలు వచ్చేలా చేసుకోవడంలో బింబిసార సక్సెస్ అయ్యాడు. రెగ్యులర్ ఎంటర్ టైనర్స్ కి భిన్నంగా ఏదో ప్రయత్నించారనే అభిప్రాయం కలుగుతోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే కుదిరింది. కళ్యాణ్ రామ్ తప్ప ఇంకే ఆర్టిస్టుని రివీల్ చేయలేదు. భారీ సినిమాల రిలీజ్ షెడ్యూల్ చూస్తుంటే బింబిసార డిసెంబర్ లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 10న లక్ష్య, గుడ్ లక్ సఖి వస్తున్నాయి. 17కి పుష్ప ఫిక్స్ అయ్యింది. నెలాఖరుకు వెళ్తే కేవలం వారం గ్యాప్ లో ఆర్ఆర్ఆర్ వచ్చేస్తుంది. సో ఎలా చూసుకున్నా బింబిసారుడి దర్శనం త్వరగానే జరిగేలా కనిపిస్తోంది. ఇదైనా కళ్యాణ్ రామ్ కి హిట్ ఇవ్వాలి

Also Read : Shiva Shankar Master : శివ శంకర్ మాస్టర్ - పేరు కాదు ఒక బ్రాండ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp