మైనపు బొమ్మగా పంచదార భామ

By Ravindra Siraj Feb. 05, 2020, 11:05 am IST
మైనపు బొమ్మగా పంచదార భామ

మగధీర సినిమాలో హీరొయిన్ కాజల్ అగర్వాల్ ని వర్ణిస్తూ రామ్ చరణ్ పంచదార బొమ్మా అంటూ ఓ పాట అందుకుంటాడు. నిజంగా ఆ లిరిక్స్ లో చెప్పినట్టే తన అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటుతున్నా ఇంకా కెరీర్ లో కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక సింగపూర్ టుస్సాడ్ మ్యుజియంలో తన మైనపు బొమ్మను చూసుకుని మురిసిపోతోంది. ఇప్పటిదాకా ఇలాంటి ఫీట్ అందుకున్న మొదటి సౌత్ ఇండియన్ బ్యూటీ కాజలే కావడం విశేషం.

కుటుంబ సభ్యులతో కలిసి సింగపూర్ వెళ్ళిన కాజల్ అగర్వాల్ స్టాచ్యు చూసి ఏది బొమ్మో ఏది భామో అర్థం కానంత సహజంగా తీర్చిదిద్దటం విశేషం. కాజల్ అగర్వాల్ తో పాటు ఆమె అభిమానుల ఆనందం మాములుగా లేదు. గత ఏడాది మహేష్ బాబు తర్వాత మనవాళ్ళకు ఎవరికీ ఈ గౌరవం దక్కలేదు. అంతకు ముందు ప్రభాస్ ఫస్ట్ టైం ఇది సాధించి వార్తల్లో నిలిచాడు. బాలీవుడ్ లో ఎందరో స్టార్లు వాళ్ళ బొమ్మలు చూసుకున్నా సౌత్ స్టార్లకు మాత్రం కొంచెం టైం ఎక్కువగా పడుతోంది.

కాజల్ అగర్వాల్ కెరీర్ పరంగా చూసుకుంటే ఇప్పటిదాకా ఎన్నో ఫీట్లు సాధించింది. తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సరసన లక్ష్మి కళ్యాణంతో పరిచయమైన కాజల్ మొదటి బ్రేక్ ని కృష్ణవంశి చందమామతో అందుకుంది. మొదలుపెట్టింది చిన్న హీరోలతోనే అయినా తక్కువ సమయంలోనే స్టార్లతో జోడి కట్టింది. ఇప్పుడున్న క్రేజీ హీరోలందరితోనూ సినిమాలు చేసిన క్రెడిట్ కాజల్ కు ఉంది. మూడేళ్ళ క్రితం చిరంజీవి ఖైది నెంబర్ 150తో ఇప్పుడు కమల్ హాసన్ ఇండియన్ 2లో ఆఫర్లు కొట్టేసిన కాజల్ అందరికి తనే బెస్ట్ ఛాయస్ గా నిలవడం విశేషం. ఇప్పుడీ మైనపు బొమ్మ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp