కాజల్‌ కూడా హైద్రాబాద్‌ వచ్చేయాల్సిందే.!

By Satya Cine Sep. 16, 2020, 12:22 pm IST
కాజల్‌ కూడా హైద్రాబాద్‌ వచ్చేయాల్సిందే.!
కరోనా కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, మళ్ళీ ఇప్పుడిప్పుడే పునఃప్రారంభమవుతున్నాయి.టాలీవుడ్‌లో ఈజోరు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో, అందాల భామలు ముంబై నుంచీ, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచీ అందాల భామలు హైద్రాబాద్‌లో ల్యాండ్‌ అయిపోతున్న విషయం విదితమే. ఇదివరకటిలా వచ్చి వెళ్ళిపోవడం కాకుండా, కొన్నాళ్ళు ఇక్కడే వుండిపోవాల్సిన పరిస్థితి వస్తోది కరోనా జాగ్రత్తల నేపథ్యంలో హీరోయిన్లకి. ఇక, అసలు విషయానికొస్తే హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ కూడా ముంబై నుంచి హైద్రాబాద్‌కి రానుందట. ఎక్కువ రోజులు హైద్రాబాద్‌లోనే వుండాలి గనుక, కుటుంబంతో కలిసి వచ్చేయాలనుకుంటోందట కొన్నాళ్ళపాటు. మెగాస్టార్‌ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన కాజల్‌, మరో రెండు సినిమాల్ని టాలీవుడ్‌లో చేయాల్సి వుంది. కాగా, తమిళ సినీ పరిశ్రమలోనూ షూటింగులు జోరందుకోనున్న నేపథ్యంలో, హైద్రాబాద్‌ - చెన్నయ్‌ మధ్య కాజల్‌ షటిల్‌ సర్వీస్‌ చేయాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, తెలుగు కంటే ఆమె తమిళంలోనే ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేస్తోంది. అయితే, హైద్రాబాద్‌ ప్రస్తుతానికి చెన్నయ్‌ కంటే కరోనా పరంగా సేఫ్‌ కావడంతో హైద్రాబాద్‌లోనే ఫ్యామిలీతోపాటు మకాం పెట్టాలన్నది కాజల్‌ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నెలాఖరులోగా ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ తిరిగి పట్టాలెక్కే అవకాశం వుందని సమాచారం. ఓ యాడ్‌ షూట్‌ కూడా కాజల్‌ మీద హైద్రాబాద్‌లో జరగనుందన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారం.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp