కోటీశ్వరులు'ను సీరియస్ గా తీసుకున్న ఎన్టీఆర్

By iDream Post Sep. 22, 2021, 04:30 pm IST
కోటీశ్వరులు'ను సీరియస్ గా తీసుకున్న ఎన్టీఆర్

తెలుగు సినిమా హీరోలు అందరూ ఇప్పుడు బుల్లితెర మీద కూడా దృష్టి పెట్టారు.. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున వంటి వారు గతంలో కొన్ని షోలకు హోస్ట్ గా వ్యవహరించగా ఇప్పుడు నాగార్జున, ఎన్టీఆర్, తమన్నా వంటి వాళ్ళు బుల్లితెర లో తనదైన మార్కు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తుండగా ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే తమన్నా మాస్టర్ చెఫ్ అనే ఒక ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.. అయితే నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ప్రోగ్రాంకి టిఆర్పీల మోత కొత్తదేమీ కాదు కానీ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం మాత్రం జెమినీ టీవీకి ఒక రకంగా బూస్ట్ ఇస్తుంది అని చెప్పవచ్చు.

అయితే మిగతా చానల్స్ తో పోటీ పడే రేంజ్ కాదు కానీ జెమినీ టీవీ మునుపెన్నడూ చూడని విధంగా టిఆర్పీలు పెంచుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఎవరు మీలో కోటీశ్వరులు నిర్వాహకులు కూడా ఎక్కువగా స్పెషల్ ఎపిసోడ్స్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్టీఆర్ తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నాడట. ఇప్పటికే కర్టెన్ రైజర్ ఈవెంట్ కి రామ్ చరణ్ తేజ గెస్ట్ గా హాజరు కాగా తాజాగా ఒక ఎపిసోడ్లో దర్శకధీరుడు రాజమౌళి, అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ ఇద్దరు కూడా కనిపించి కనువిందు చేశారు. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఈ హాట్ సీట్లో కూర్చుని ఆట ఆడబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి కాగా ఆయన పాతిక లక్షల రూపాయలు గెలుచుకున్నారు అట. గేమ్ రూల్స్ ప్రకారం ఆ పాతిక లక్షల రూపాయలు కూడా ఆయన చారిటీకి డొనేట్ చేశారు అని అంటున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ షోలో భాగంగా కాబోతున్నారట. ప్రభాస్, ఎన్టీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉండడంతో ఎన్టీఆర్ స్వయంగా ప్రభాస్ ను షోకి హాజరు కావాలని కోరడంతో ఆయన కూడా వస్తానని మాటిచ్చాడు అని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరి మధ్య జరగబోయే ఎపిసోడ్ షూటింగ్ కూడా జరుగుతుందని అంటున్నారు. మొత్తం మీద వెండి తెర మీద ఎప్పటికో గాని చూడలేము అనుకుంటున్న కాంబినేషన్లు అన్నింటినీ బుల్లితెర మీద ఇప్పుడే చూపించేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక మహేష్ బాబు స్పెషల్ ఎపిసోడ్ దసరాకి టెలీకాస్ట్ అవ్వచ్చని ప్రచారం జరుగుతుండగా ప్రభాస్ స్పెషల్ ఎపిసోడ్ ఆ తర్వాత బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Also Read : 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp