Naatu Naatu : తారక్ చరణ్ మాస్ మూమెంట్స్ అదిరాయిగా

By iDream Post Nov. 10, 2021, 03:40 pm IST
Naatu Naatu : తారక్ చరణ్ మాస్ మూమెంట్స్ అదిరాయిగా

పాన్ ఇండియా లెవెల్ లో కనివిని ఎరుగని భారీ బడ్జెట్ తో రూపొందుతున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ నుంచి అభిమానులు కోరుకున్న అసలైన మాస్ పాట వచ్చేసింది. ఇండస్ట్రీ బెస్ట్ డాన్సర్స్ లో ఇద్దరైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ను ఒకే ఫ్రేమ్ లో నృత్యం చూడలేమేమో అనుకున్న ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా లిరికల్ వీడియోని ఇందాక విడుదల చేశారు. మొన్న చిన్న ప్రోమో వదిలారు కానీ దాని మీద పలురకాల కామెంట్లు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ గట్టి చర్చే జరిగింది. దీనికి చెక్ పెడుతూ పూర్తి పాటను రిలీజ్ చేశాక క్లారిటీ వచ్చేసింది. అసలైన గూస్ బంప్స్ స్టఫ్ ఇదేనంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యూన్ ఆద్యంతం చాలా హుషారుగా ఫుల్ మాస్ బీట్స్ లో సాగింది. చంద్రబోస్ సాహిత్యం కీరవాణి హుషారు రెండూ కలగలిసి పోయి అంచనాలను అమాంతం పెంచేశాయి. రాహుల్ సిప్లిగుంజ్, కాల భైరవ గాత్రాలు ఓ రేంజ్ లో పేలాయి. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ వీటికేమి తీసిపోని స్థాయిలో సాగింది. మొత్తం కాకపోయినా చరణ్ తారక్ ఇద్దరూ కలిసి చేసిన రెండు మూడు డాన్స్ బిట్స్ ఇందులో చూపించడంతో ఫాన్స్ రిపీట్ మోడ్ లో వెళ్లడం ఖాయం. ఇద్దరూ పోటీ పడుతూ చూపించిన గ్రేస్, ముఖంలో ఎక్స్ ప్రెషన్లు విందు భోజనం అనిపించాయి. మొత్తానికి ఏదైతే నాటు నాటు నుంచి కోరుకున్నారో దాన్ని రాజమౌళి సంపూర్ణంగా నెరవేర్చి హైప్ ని పెంచేశారు

నిజానికి ఆర్ఆర్ఆర్ కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే ఇద్దరు హీరోలు ఇలా డాన్స్ చేసే సందర్భం వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ మాస్ పల్స్ ని చదవడంలో పిహెచ్డి చేసిన రాజమౌళికి అదో పెద్ద విషయమా. దీని కోసమే ప్రత్యేకంగా విదేశాలకు వెళ్లి మరీ షూట్ చేసుకుని వచ్చారు. ఇవాళ వచ్చింది ఆ సాంగే. ఇది సినిమా అయ్యాక మగధీర తరహాలో ఎండ్ క్రెడిట్స్ లో వస్తుందా లేక ఏదైనా సిచువేషన్ లో సెట్ చేశారా అనేది వేచి చూడాలి. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్, శ్రేయ, సముతిరఖని, రాహుల్ రామకృష్ణలు ఇతర పాత్రలు పోషించారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించారు.

Also Read : Stuartpuram Tiger : నిజమైన దొంగ హక్కులు ఎవరికి దక్కుతాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp