సలార్ కోసం జాన్ అబ్రహాం ?

By iDream Post Jan. 07, 2021, 07:55 pm IST
సలార్ కోసం జాన్ అబ్రహాం ?

ప్రస్తుతం రాధే శ్యామ్ తప్ప మరో ప్రపంచం లేకుండా ఉన్న ప్రభాస్ దాని షూటింగ్ మరికొద్దిరోజుల్లో పూర్తి చేయనున్నాడు. తర్వాత బ్యాలన్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేస్తారు. ఆ వెంటనే డార్లింగ్ సలార్ టీమ్ తో కలుస్తాడు. ఆ టైంకంతా కెజిఎఫ్ 2 పనులన్నీ పూర్తయిపోయి ఉంటాయి కాబట్టి దర్శకుడు ప్రశాంత్ నీల్ దీని మీద సీరియస్ ఫోకస్ పెట్టబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందబోయే సలార్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోందని ఇన్ సైడ్ టాక్. మరి హీరో ఎలివేట్ అవ్వాలంటే విలన్ చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఆల్మోస్ట్ సెట్ అయినట్టేనని ముంబై న్యూస్.

అతనెవరో కాదు బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహం. కానీ ప్రస్తుతం ఇది ప్రతిపాదన కం చర్చల దశలోనే ఉందట. జాన్ ఓకే చేసి డేట్లు ఇస్తే తప్ప ఖరారుగా చెప్పలేని పరిస్థితి. పాజిటివ్ నెగటివ్ తనకిచ్చిన ఏ క్యారెక్టర్ అయినా తన టైమింగ్ తో నిలబెట్టే జాన్ అబ్రహం కనక సలార్ లో ఉంటే రేంజ్ ఇంకా పెరుగుతుంది. స్టైలిష్ విలన్ గా జాన్ గతంలో చేసిన ధూమ్ లాంటివి కేవలం ఇతని స్క్రీన్ ప్రెజెన్స్ వల్లే ఆడిన విషయాన్ని మర్చిపోకూడదు. ఘర్షణ రీమేక్ లోనూ అద్భుతంగా నటించాడు. ప్రస్తుతం సత్యమేవ జయతే సీక్వెల్ షూట్ లో బిజీగా ఉన్న జాన్ ఏ విషయాన్నీ ఇంకొద్ది రోజులు చెబుతానని ప్రశాంత్ తో అన్నట్టు వినికిడి.

కెజిఎఫ్ వల్ల ప్రతిదీ పాన్ ఇండియా లెవెల్ లో చేయాల్సి రావడంతో ప్రశాంత్ నీల్ క్యాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సంజయ్ దత్ ని ఒప్పించగలిగాడంటేనే ఇతని టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ లెక్కలు పక్కన పెడితే సలార్ ని మాత్రం రాధే శ్యామ్ అంత ఆలస్యం కాకుండా ప్లానింగ్ చేస్తున్నారట. హీరోయిన్ కూడా ఇంకా ఫైనల్ కాలేదు. దిశా పటాని, కియారా అద్వానీ అంటూ ఏవేవో పేర్లు విన్పిస్తున్నాయి కానీ ఎవరనేది ఖరారుగా చెప్పడం లేదు . సంగీత దర్శకుడితో సహా దాదాపు కెజిఎఫ్ టీమ్ మొత్తం సలార్ కోసం పనిచేయబోతోంది. మరికొన్ని డీటెయిల్స్ త్వరలోనే తెలియొచ్చు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp