అందుకే OTTకి ఓకే చెప్పారా

By iDream Post Jun. 15, 2021, 06:30 pm IST
అందుకే  OTTకి  ఓకే చెప్పారా
ఇంకో రెండు రోజుల్లో ధనుష్ జగమే తంత్రం నెట్ ఫ్లిక్స్ ద్వారా డైరెక్ట్ డిజిటల్ రూపంలో రాబోతోంది. ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి, కర్ణన్ ఎఫెక్ట్ తో మనవాళ్ళు కూడా దీని మీద చాలా ఆసక్తిగా ఉన్నారు. దానికి తోడు తెలుగుతో సహా మొత్తం 17 భాషల్లో డబ్బింగ్ చేయడంతో రీచ్ ఊహించని రేంజ్ లో ఉండబోతోంది. ఇండియన్ నెట్ ఫ్లిక్స్ హిస్టరీలో హయ్యస్ట్ వ్యూస్ దీనికే వస్తాయని ఒక అంచనా. ఇప్పటిదాకా  సూర్య పేరు మీదున్న ఆకాశం నీ హద్దురా రికార్డులు జగమే తంత్రం ఈజీగా బ్రేక్ చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రైమ్ ఉన్నంత స్థాయిలో కామన్ ఆడియన్స్ నెట్ ఫ్లిక్స్ కు లేరు. ఇది కొంత ప్రభావితం చేసే అంశమే.

ఇక విషయానికి వస్తే జగమే తంత్రం ఓటిటి హక్కులకు గాను నెట్ ఫ్లిక్స్ సుమారు అరవై కోట్ల దాకా చెల్లించినట్టు ఇన్ సైడ్ టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ చెన్నై వర్గాలు దీన్నే ఉటంకిస్తున్నాయి. శాటిలైట్ హక్కులు నిర్మాత విడిగా అమ్ముకుంటాడు. ఒకవేళ తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాల్లో థియేటర్లు తెరిస్తే అప్పుడు రీ రిలీజ్ చేసే వెసులుబాటు కూడా ప్రొడ్యూసర్ కు ఉంటుంది. ఏ కోణంలో చూసుకున్నా జగమే తంత్రం చాలా సేఫ్ జోన్ లో ఉంది. ఎటొచ్చి కంటెంట్ మీదే అనుమానాలు ఉన్నాయి. పేట, కబాలి ని మిక్స్ చేసి ఓవర్సీస్ లుక్ ఇచ్చినట్టు ఉందని ఇప్పటికే కొందరు కామెంట్స్ గుప్పించారు

ఇప్పుడీ సినిమాకు ఏ స్థాయి స్పందన వస్తుందో చూడాలి. ఎంత డైరెక్ట్ ప్రీమియర్ అయినా ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజాలకు సైతం పైరసీ బెడద వదలడం లేదు. దీని వల్లే సుమారు పాతిక శాతం పైగా వ్యూస్ పోతున్నాయని వాళ్ళ రీసెర్చ్ లో తేలిన విషయం. కేవలం టొరెంట్ వెబ్ సైట్స్ లో మాత్రమే కాకుండా టెలిగ్రామ్ యాప్ లను కూడా పైరసీ బిజినెస్ కు వాడుకోవడం రెవిన్యూని బాగా దెబ్బ తీస్తోంది. ఒకవేళ పైరసీని కనక అరికట్టగలిగితే ప్రతి నిర్మాత కనీసం ముప్పై శాతం దాకా అదనంగా సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. కానీ జగమే తంత్రంతోనైనా ఇది ఆగుతుందేమో అనుకుంటే ఆ ఛాన్స్ లేదు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp