సురేష్ బాబు ఇంటిపై ఐటీ దాడులు

By Kiran.G 20-11-2019 12:30 PM
సురేష్ బాబు ఇంటిపై ఐటీ దాడులు

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న సురేష్ బాబు ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సురేష్ బాబు నివాసంతో పాటు రామానాయుడు స్టూడియో మరియు సురేష్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అనేక కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. సురేష్ బాబు ప్రముఖ నిర్మాత అయిన రామానాయుడి గారి పెద్ద కుమారుడు. తండ్రిలానే సురేష్ బాబు కూడా మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమా నిర్మాణ రంగంలో అనతి కాలంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగారు. కానీ గత కొంతకాలంగా ఎక్కువగా చిన్న సినిమాలను సురేష్ బాబు పంపిణి చేస్తున్నారు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా థియేటర్లు కూడా ఉన్నాయి.

కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్‌, దిల్‌ రాజు, కెఎల్‌ నారాయణ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. గత నెలలో ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. సంస్థ అధినేతలు నారయణదాస్‌, సునీల్‌ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇలా సినిమా నిర్మాతలపై వరుసగా ఐటీ దాడులు జరగడం వల్ల పలువురు నిర్మాతలు కంగారు పడుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News