'సలార్'లో ప్రభాస్ పాత్ర అదేనా

By iDream Post Dec. 04, 2020, 03:28 pm IST
'సలార్'లో ప్రభాస్ పాత్ర అదేనా

ఊహించని విధంగా రెండు రోజుల క్రితం ప్రభాస్ కొత్త సినిమా సలార్ ఫస్ట్ లుక్ విడుదల చేసి ఆశ్చర్యపరిచిన కెజిఎఫ్ నిర్మాతలు దాని షూటింగ్ ని త్వరలోనే మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆది పురుష్ తో పాటు డార్లింగ్ ఇందులో కూడా సమాంతరంగా పాల్గొంటాడని ఫిలిం నగర్ టాక్. కాకపోతే రాధే శ్యామ్ తాలూకు పనులు ప్రమోషన్లు అన్నీ పూర్తయ్యాకే ఇది సెట్స్ పైకి వెళ్తుంది. ఇదిలా ఉండగా సలార్ ఏ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుందనే ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా ఉంది. పోస్టర్ ని బట్టి చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది కాబట్టి మాస్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం ఛాయల్లోనే సలార్ సాగుతుందనే టాక్ చాలా బలంగా వినిపిస్తోంది. ఇది తెలిసినప్పటి నుంచి యుట్యూబ్లో ఆ సినిమా చూస్తున్న వాళ్ళు లేకపోలేదు. అందులో స్టోరీకి ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ గెటప్ కి దగ్గరగా మ్యాచ్ అవుతుంది. ఇద్దరు బద్ధ శత్రువులైన గ్యాంగ్ రైవల్స్ మధ్య హీరో చేసే పోరాటమే ఉగ్రంలోని మెయిన్ పాయింట్. అందులో ఒక లీడర్ కూతురిగా హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. వాళ్ళ నుంచి ఆమెను కాపాడే క్రమంలో వచ్చే ఎపిసోడ్స్, సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. సలార్ లో ఇదే తరహాలో కథనం ఉండొచ్చని అంటున్నారు.

ఇది నిజమో కాదో ఇప్పుడే చెప్పలేం కానీ వాస్తవమైనా మంచిదే. ఎందుకంటే ఈ సబ్జెక్టులో ఓ రేంజ్ లో హీరో ఎలివేషన్స్ ఉంటాయి. గూస్ బంప్స్ పక్కా. 2014లో ఉగ్రం విడుదలైనప్పుడు డివైడ్ టాక్ వచ్చింది. పబ్లిక్ టాక్ తో పికప్ అయ్యాక ఏకంగా 150 రోజుల పాటు నాన్ స్టాప్ గా ప్రదర్శితమయ్యింది. అప్పటిదాకా చిన్న హీరోగా నెట్టుకొస్తున్న శ్రీమురళి దీని దెబ్బకే స్టార్ అయ్యాడు. అలాంటిది ఇంత పవర్ ఫుల్ కథలో ప్రభాస్ కనిపిస్తే జాతర ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పాలా. కెజిఎఫ్ ఫినిష్ కాగానే ప్రశాంత్ నీల్ వెంటనే సలార్ పనుల్లో ఉంటాడు. టీమ్ దాదాపు అదే ఉండొచ్చు కూడా. విడుదల ఆదిపురుష్ కన్నా ముందే ఉన్నా ఆశ్చర్యం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp