చిరంజీవి రిస్క్ అనుకుంటున్నారా

By iDream Post Oct. 17, 2020, 07:19 pm IST
చిరంజీవి రిస్క్ అనుకుంటున్నారా

ఎందుకనో మరి మెగాస్టార్ చిరంజీవి తన కంబ్యాక్ తర్వాత పూర్తి డిఫెన్స్ మోడ్ లో పడినట్టు కనిపిస్తోంది. సైరా ల్యాండ్ మార్క్ డ్రీం ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని మినహాయిస్తే ఒక్క ఆచార్య మాత్రమే ఆయన ఓకే చేసిన స్ట్రెయిట్ సబ్జెక్టు. అది కూడా భీభత్సమైన ఫామ్ లో ఉన్న కొరటాల శివ దర్శకుడు కాబట్టి. ఇంకా దాని షూటింగ్ బ్యాలన్స్ కొనసాగాల్సి ఉంది. వీటికన్నా ముందు రీ ఎంట్రీకి ఎంచుకున్న ఖైదీ నెంబర్ 150 అరవం నుంచి తీసుకొచ్చిన కత్తి . త్వరలో మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఐదేళ్ల క్రితం వచ్చిన తమిళ మూవీని రీమేక్ చేయడం గురించి ఇప్పటికే మిశ్రమ స్పందన ఉంది.

అందులోనూ అదేమీ ఎక్స్ ట్రాడినరీ సబ్జెక్టు కాదు. రొటీన్ గా బాషా, మాస్టర్, సమరసింహారెడ్డి స్టైల్ లో అండర్ కరెంట్ హీరోయిజంతో సాగుతుంది. ఇది కాగానే మలయాళం లూసిఫర్ రీమేక్ కోసం వివి వినాయక్ రంగంలోకి దిగుతాడు. రచయిత ఆకుల శివతో కలిసి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు వేగవంతం చేసినట్టు తెలిసింది. ఎవరిది ముందు మొదలవుతుందో పక్కాగా క్లారిటీ రాలేదు కానీ పరిస్థితి చూస్తే మెహర్ రమేష్ కే ఫస్ట్ ఛాన్స్ దక్కేలా ఉంది. వీళ్లది కాగానే దర్శకుడు బాబీ లైన్ లో ఉన్నాడు. ఫైనల్ వెర్షన్ ఇంకా ఓకే కాలేదు కానీ లైన్ అయితే నచ్చిందని టాక్ ఉంది. దీనికి చాలా టైం పట్టేలా ఉంది.

ఇవి చాలవు అన్నట్టు అజిత్ నటించిన మరో సినిమా ఎన్నై ఆరిందాళ్ కూడా చేసే ఆలోచన చిరు చేస్తున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. ఇది కూడా 2015లో వచ్చిన సినిమానే. అనుష్క హీరోయిన్. గౌతమ్ మీనన్ దర్శకుడు. తెలుగులో ఎంతవాడుగాని పేరుతో డబ్ చేస్తే ఓ మోస్తరుగా ఆడింది. టీవీలో కూడా చాలా సార్లు టెలికాస్ట్ చేశాడు. వేదాళం, ఎన్నై ఆరిందాళ్ రెండింటి ఒరిజినల్ వెర్షన్ నిర్మాత ఏఎం రత్నమే. అందుకే దీని హక్కులు కూడా కొనేందుకు మెగా కాంపౌండ్ ఆసక్తి చూపిస్తోందట. ఎంత టాలీవుడ్ లో కథల కొరత ఉంటే మాత్రం ఇలా ఇన్నేసి రీమేకులు చేయడం గురించి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp