కొత్త రిలీజులకు IPL బ్రేకు

By iDream Post Sep. 15, 2020, 05:19 pm IST
కొత్త రిలీజులకు IPL బ్రేకు

థియేటర్లు మూతబడిన వేళ ఓటిటి వేదికలే కొత్త సినిమాలకు ఒకే ఒక్క ఆప్షన్ గా మారిన తరుణంలో ఇప్పటిదాకా ప్రేక్షకులు ఇంట్లో నుంచే వినోదాన్ని బాగా ఆస్వాదించారు. ముఖ్యంగా బాలీవుడ్ లో సంజయ్ దత్., సుశాంత్ సింగ్ రాజ్ పూత్, విద్యుత్ జమాల్ లాంటి స్టార్ హీరోల మూవీస్ కూడా ఉచితంగా చూశారు. అయితే అసలైన క్రేజీ చిత్రాలు మాత్రం ఇంకా విడుదల కాలేదు. వాటిలో ముఖ్యంగా అక్షయ్ కుమార్ లక్స్మీ బాంబ్, అజయ్ దేవగన్ భుజ్, అభిషేక్ బచ్చన్ బిగ్ బుల్ లాంటివి ఉన్నాయి. అయితే తాజా సమాచారం మేరకు వీటి హక్కులు పొంది ఉన్న డిస్నీ హాట్ స్టార్ వీటిని కొంత కాలం వాయిదా వేయబోతోందట. దానికి కారణం ఐపిఎల్.

దీని టెలికాస్ట్ కూడా స్టార్ నెట్ వర్క్ లోనే రాబోతోంది. అసలే గత ఏడెనిమిది నెలలుగా క్రికెట్ లవర్స్ ఆకలి మీదున్నారు. ఎప్పుడెప్పుడు పొట్టి క్రికెట్ ని ఎంజాయ్ చేద్దామా అని కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఎలాగూ నేరుగా స్టేడియంకు వెళ్లి చూసే అవకాశం లేదు కాబట్టి అందరూ టీవీలకు స్మార్ట్ ఫోన్ లకు అతుక్కుపోవడం ఖాయం. అలాంటపుడు ఏ హీరో సినిమా వచ్చినా అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. ఇండియాలో ఈ క్రీడా మీద ఆసక్తి లేని వాళ్ళు చాలా తక్కువ. ఇక బెట్టింగ్ బంగార్రాజుల గురించి చెప్పేదేముంది. టోర్నమెంట్ అయ్యేదాకా సందడి మాములుగా ఉండదు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలు విడుదల చేసి రిస్క్ లో పడటం ఎందుకని పోస్ట్ పోన్ చేస్తారట. అంటే నవంబర్ లో కానీ వీటికి మోక్షం దక్కదన్న మాట.

దీపావళికి లక్స్మీ బాంబ్ ప్రీమియర్ చేసి డిసెంబర్ లో మిగిలిన రెండు ప్లాన్ చేయొచ్చు. ఇప్పటిదాకా అన్ని ఓటిటి యాప్స్ తో పోల్చుకుంటే డైరెక్ట్ ఓటిటి రిలీజుల్లో ముందున్నది డిస్నీ హాట్ స్టారే. ఇప్పుడు అదే వెనుకడుగు వేస్తే మిగిలినవాళ్లు ఆలోచిస్తారనడంలో సందేహం అక్కర్లేదు. మరి దీని ఎఫెక్ట్ తెలుగు రిలీజుల మీద కూడా ఉంటుందా అంటే ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతానిని ఒరేయ్ బుజ్జిగా మాత్రమే అక్టోబర్ 2కి లాక్ చేశారు. మిగిలిన ప్రకటనలు ఏవీ రాలేదు. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లు సైతం ఐపిఎల్ ట్రెండ్ మీద గట్టి ఫోకస్ పెట్టాయి. దాన్ని మర్చిపోయి షెడ్యూల్ చేసుకుంటే వ్యూస్ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో తొందరపడి డేట్లు ప్రకటించడం లేదు. ఐపిఎల్ దెబ్బ ఇలా ఓటిటి మీద పడటం వినోద ప్రియులకు దెబ్బే. అసలే థియేటర్లు లేవు. పోనీ డిజిటల్ లోనైనా కొత్త సినిమాల ముచ్చట తీర్చుకుందామంటే ఇదుగో ఇలా బ్రేకులు పడబోతున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp