పాన్ ఇండియా స్థాయిలో సుక్కు ప్రెజెంటేషన్

By iDream Post Apr. 08, 2021, 12:00 pm IST
పాన్ ఇండియా స్థాయిలో సుక్కు ప్రెజెంటేషన్

నిన్న రాత్రి నెట్టింట్లోకి వచ్చిన పుష్ప టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ రేంజ్ లో చేసిన వేడుకలో దీన్ని విడుదల చేయడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ఆద్యంతం కట్టిపడేసే విజువల్స్, తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా చూసే దట్టమైన అటవీ వాతావరణం, ఊహించని స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్, అన్నిటిని మించి అల్లు అర్జున్ ని ఎన్నడూ చూడని రీతిలో పుష్పరాజ్ గా సుకుమార్ ఆవిష్కరించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అల వైకుంఠపురములో లాంటి క్లాస్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇలాంటి కథను ఎంచుకోవడంలోనే బన్నీ ఎంత వైవిధ్యంగా ఆలోచిస్తున్నాడో అర్థమవుతోంది.

ఒక్క హీరోయిన్ రష్మిక మందన్నను తప్ప టీజర్ లో ఇంకెవరిని రివీల్ చేయలేదు. అయితే సుక్కు టీమ్ మాత్రం అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. పాన్ ఇండియా లెవెల్ లో వెళ్లాల్సిన సినిమా అనే ఫీలింగ్ నూరు శాతం కలిగించింది. ఒక కమర్షియల్ స్టార్ ఇలాంటి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో చేయడం చాలా అరుదు. దశాబ్దాల క్రితం చిరంజీవి అడవిదొంగ, విజయ్ కాంత్ కెప్టెన్ ప్రభాకర్, వెంకటేష్ బొబ్బిలి రాజా లాంటివి గొప్ప విజయాలు సాధించాయి కానీ ఆ తర్వాత వీటిని ఎక్కువగా టచ్ చేసిన వాళ్ళు లేరు. అందుకే పుష్ప చాలా డిఫరెంట్ ఫీలింగ్ కలిగిస్తోంది. ఇక బన్నీ ఫ్యాన్స్ గురించి చెప్పేదేముంది.

మరో విశేషం ఇన్నాళ్లు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ట్యాగ్ ని పుష్పతో ఐకానిక్ స్టార్ గా మార్చేశారు. కారణాలు ఏమిటో తెలియదు మరి. ఇప్పటికే కేరళతో సహా చాలా చోట్ల బన్నీకి స్టైలిష్ స్టార్ గానే ఎక్కువ గుర్తింపు. ఇప్పుడు బిరుదు చేంజ్ కావడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయేమో చూడాలి. ఇక మరో కీలకమైన హై లైట్ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. చిన్న వీడియో బిట్టే అయినప్పటికీ తన మార్కు చూపించేశారు. మిరోస్లా కుబా బ్రోజెక్ చాయాగ్రహణం హాలీవుడ్ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. ఒక్క టీజర్ తో  పుష్ప బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయిందని ట్రేడ్ టాక్

Teaser Link @ https://bit.ly/3mqLy3X

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp