ఊరిస్తున్న రవితేజ 'క్రాక్' హైలైట్స్

By iDream Post Jun. 09, 2020, 12:17 pm IST
ఊరిస్తున్న రవితేజ 'క్రాక్'  హైలైట్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న క్రాక్ షూటింగ్ ఇంకొంత మాత్రమే బాలన్స్ ఉంది. షూటింగులకు అనుమతులు వచ్చేశాయి కాబట్టి ఇంకొద్ది రోజుల్లో క్రాక్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. గత కొంత కాలంగా హిట్లు లేక హ్యాట్రిక్ డిజాస్టర్లు అందుకున్న రవితేజ అభిమానుల ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఇక ఇందులో హై లైట్స్ ఓ రేంజ్ ఉంటాయని తాజాగా వస్తున్న అప్డేట్. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో సాగే కథలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో జాలర్ల ముసుగులో దందాలు చేసే గ్యాంగ్ లకు లీడర్లుగా వరలక్ష్మి శరత్ కుమార్, సముతిరఖని కనిపిస్తారు. వాళ్ళను ప్రభుత్వాలే ఏమి చేయాలని పరిస్థితిలో ఒక ఖాకీ యూనిఫామ్ వేసుకున్న పోలీస్ ఎలా ఎదురుకున్నాడు అనే కథతో క్రాక్ రూపొందిందని టాక్. కర్నూల్ నుంచి అదే పనిగా ట్రాన్స్ ఫర్ చేయించుకుని వచ్చి మరీ వీళ్ళ అంతు చూసే పనికి దిగుతాడట. ఇంటర్వెల్ బ్లాక్ ఓ రేంజ్ లో ఉంటుందని, సెకండ్ హాఫ్ మొత్తం రేసీ స్క్రీన్ ప్లేతో ఊహించని విధంగా సాగుతుందని వినికిడి. జాలర్ల గ్యాంగ్ తో రవితేజ చేసే ఛేజ్ ఎపిసోడ్ ఈ మధ్య కాలంలో చూడని బెస్ట్ యాక్షన్ సీన్ అవుతుందని చెబుతున్నారు.

అంతే కాదు విక్రమార్కుడులో సత్తికి రెట్టింపు తిక్క జోడిస్తే ఎలా ఉంటుందో అది క్రాక్ లో కనిపిస్తుందట. కాకపోతే హీరోయిన్ తో రొమాన్స్ ట్రాక్ కంటే విలన్స్ తో క్లాష్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి గోపిచంద్ చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్ తో క్రాక్ ని రూపొందించినట్టు తెలిసింది. తమన్ సంగీతం కూడా కిక్ రేంజ్ లో ఉంటుందని ఇలా రకరకాలుగా ఫ్యాన్స్ ని ఊరించేలా క్రాక్ రాబోతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కు ముందు విడుదల ఆగిపోయిన సినిమాల డేట్లు ఫిక్స్ అయ్యాక క్రాక్ రిలీజ్ కు సంబంధించి ఒక స్పష్టత వస్తుంది. దీని తర్వాత రవితేజ రమేష్ వర్మ, వక్కంతం వంశీ, త్రినాథ రావు నక్కినలకు కమిట్ అయ్యారు. అయితే వీటిలో ఎవరిది ముందు ప్రారంభమవుతుందన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp