కంటెంట్ బలంగా ఉంటే అదేం సమస్య కాదు

By iDream Post May. 05, 2021, 05:00 pm IST
కంటెంట్ బలంగా ఉంటే అదేం సమస్య కాదు
ఢిల్లీ నుంచి గల్లీ దాకా మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న కెజిఎఫ్ 2 తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి వస్తున్నాయి. వీలైనంత త్వరగా పూర్తి చేసి సెన్సార్ సర్టిఫికెట్ ని సిద్ధం చేసుకునేలా నిర్మాతలు హోంబాలే ఫిలిమ్స్ తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ గట్టిగానే కష్టపడుతున్నారు. ముందు చెప్పిన జూలై 19కి రిలీజ్ కావడం మాత్రం అనుమానంగానే ఉంది. దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించి పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉండటంతో వాయిదా తప్పకపోవచ్చనే టాక్ ఎక్కువగా ఉంది. ఒకవేళ అదే జరిగితే ఆగస్ట్ లేదా అంతకన్నా లేట్ గా దసరా పండగను టార్గెట్ చేయాల్సి ఉంటుంది. టీమ్ సైతం కన్ఫ్యూజన్ లోనే ఉంది.

ఇదిలా ఉండగా కెజిఎఫ్ 2 ఫైనల్ వెర్షన్ సుమారు 2 గంటల 52 నిమిషాల దాకా వచ్చిందనే టాక్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత నిడివి ఉంటే జనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తారా అని అనుమానాలు వెలిబుచ్చుతున్నారు. అయితే ఇక్కడో లాజిక్ మర్చిపోకూడదు. కంటెంట్ బలంగా ఉంటే మూడు గంటలు ఈజీగా భరిస్తారని గతంలో ప్రేక్షకులు ఋజువు చేశారు. రంగస్థలం, అర్జున్ రెడ్డి, మహానటి, బాహుబలి 2,  త్రివిక్రమ్ సినిమాలు దాదాపుగా అన్నీ అటుఇటు మూడు గంటలకు దగ్గరగా ఉంటాయి. ఇంటర్వెల్ బ్రేక్ అదనం. ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచినవే. సో విసుగు వచ్చే సమస్య ఉండదు.

ఒకప్పుడు ఇంతకన్నా పొడవైన సినిమాలు చాలా వచ్చేవి. స్వర్గీయ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ నాలుగు గంటల నిడివి ఉంటే రెండు బ్రేకులు ఇచ్చేవాళ్ళు. అయినా చరిత్ర సృష్టించింది. షోలే, హం ఆప్కే హై కౌన్ లెన్త్ మూడున్నర గంటలు. వాటి ప్రభంజనం ఒక హిస్టరీ. అమీర్ ఖాన్ లగాన్ ఇంతకన్నా ఎక్కువగా ఉంటుంది. అయినా సరే విజయం సాధించకుండా ఆగలేదు. లవకుశ కూడా అంతే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దీని వల్ల అర్ధమయ్యేదేమిటంటే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఎన్ని గంటలు అనేది పబ్లిక్ లెక్క చేయరు. ఏదైనా తేడా ఉంటేనే గంటన్నర కూడా నరకంగా అనిపిస్తుంది
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp