ఇద్దరి లోకం ఒకటే ట‌ర్కిష్ సినిమా!

By Rahul.G Dec. 24, 2019, 02:21 pm IST
ఇద్దరి లోకం ఒకటే   ట‌ర్కిష్ సినిమా!

రేపు విడుద‌ల కానున్న రాజ్‌త‌రుణ్ సినిమా ఇద్దరి లోకం ఒకటే కి ఆధారం 2011లో వ‌చ్చిన ఒక ట‌ర్కిష్ సినిమా. అయితే అదేం గొప్ప‌క‌థ కాదు. 1978లో వ‌చ్చిన అమ‌ర ప్రేమ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగులో వంద సినిమాలు వ‌చ్చాయి. మ‌రి దిల్‌రాజుకి అది ఎందుకు న‌చ్చిందో తెలియ‌దు.

స్లో నెరేష‌న్‌లో ఎలాంటి సంఘ‌ట‌న‌లు, సంఘ‌ర్ష‌ణ‌లు లేకుండా సాగే సినిమాలో ఫొటోగ్ర‌ఫీ హైలైట్‌. తెలుగులో స‌మీర్‌రెడ్డి కూడా గ‌ట్టివాడే. హీరోయిన్‌కి న‌ట‌నంటే ఇష్టం. హీరోకి ఫొటోలు తీయ‌డం.

చిన్న‌ప్ప‌టి హీరోయిన్ ఫొటో ద్వారా ఇద్ద‌రు మ‌ళ్లీ క‌లుసుకుంటారు. బాల్య స్నేహితుల‌ని తెలుసుకుంటారు. హీరోయిన్‌కి బ్రేక‌ప్ స‌మ‌స్య‌. హీరోకి ఇంకో స‌మ‌స్య‌. చివ‌రికి ఏమ‌వుతుందో సినిమా చూసి తెలుసుకోవాలి.

మూల క‌థ‌లోని Thin Line తీసుకుని , తెలుగు స్క్రీన్‌ప్లేని పూర్తిగా మార్చుకుని Cute Love Story గా మ‌లిచి ఉంటే OK గానీ, లేదంటే రాజ్‌త‌రుణ్‌కి మ‌ళ్లీ ఇబ్బందే.

కొమ్ములు తిరిగిన నిర్మాత‌ల‌కి అరిగిపోయిన క‌థ‌లెందుకు న‌చ్చుతాయో అదో స‌స్పెన్స్‌. మొన్న శ్రీ‌నివాస క‌ల్యాణం అనే పెళ్లి మీద ఉప‌న్యాసాన్ని దిల్‌రాజు తీశాడు. నిన్న వెంకీమామ అనే ముస‌లి క‌థ‌ని సురేష్‌బాబు వ‌దిలాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp